Heroine Bold Comments: యంగ్ మలయాళ బ్యూటీ ‘అనుపమ పరమేశ్వరన్’ అనగానే పద్దతిగా ఉంటుంది. అస్సలు బోల్డ్ సన్నివేశాల్లో నటించదు. పైగా ఆ అమ్మాయి హోమ్లీ నెస్ కి కేరాఫ్ అడ్రస్.. ఇలాంటి మాటలు వినిపించేవి అనుపమ గురించి. దీనికితోడు అనుపమ కూడా ఎన్నడూ ఓవర్ గా ఎక్స్ పోజ్ చేయలేదు. అలాగే అనవసరమైన వివాదాలలో దూరి బూతు కామెంట్లు చేయడం లాంటివి కూడా ఎప్పుడూ అనుపమ చేయలేదు. పైగా ఎప్పుడు సంప్రదాయ పద్ధతిలో కనిపిస్తూ సింపుల్ గా ఉంటుంది. కానీ.. తాజాగా నేను సింగిల్ కాదు, మింగిల్ అంటూ అనుపమ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాన ఊపేస్తున్నాయి.

తన రిలేషన్‌షిప్‌పై అనుపమ చేసిన ఆ కామెంట్స్ ఆమె మాటల్లోనే విందాం. ‘ ప్రేమించి పెళ్లి చేసుకున్న కపుల్స్‌ను చూస్తుంటే నాకు చాలా ముచ్చటగా అనిపిస్తుంది. అందుకే, నేను కూడా ప్రేమ వివాహమే చేసుకుంటాను. మా పేరేంట్స్‌కు కూడా ఈ విషయం తెలుసు. అసలు, నేను సింగిల్.. కాదు మింగిల్. నిజానికి ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నా రిలేషన్‌షిప్ స్టేటస్ నాకు కూడా సరిగ్గా క్లారిటీ లేదు.
నేనైతే ప్రేమలో ఉన్నా.. మరి అవతలి సైడ్ నుంచి ఏమనుకుంటున్నారో తెలియదు. ప్రస్తుతం వన్ సైడ్ లవ్ అని చెప్పగలను.’ అంటూ అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్ చేసింది. సౌత్ లో అందంలోనూ అభినయంలోనూ సమానమైన ప్రతిభ చూపించే ముద్దుగుమ్మల్లో ఈ మల్లు కుట్టి ఒకరు.

కెరీర్ బిగినింగ్ నుంచి గ్లామర్ షోస్ జోలికి పోకుండా… పెర్ఫార్మెన్స్ తోనే ప్రేక్షకుల మనసు దోచుకుంది. మదర్ ల్యాండ్ మాలీవుడ్ లో లిమిటెడ్ గానే సినిమాలు చేసినా.. తమిళ, తెలుగు సినిమాల్లో మాత్రం బెస్ట్ పెర్ఫార్మర్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఐతే, అనుపమకు కాలం కలిసి రాలేదు. మెయిన్ హీరోయిన్ గా ఎక్కువ ఛాన్స్ లు రాలేదు.
Also Read: Famous Singer Demise On Stage: షాకింగ్ : పాట పాడుతూ స్టేజ్‌పైనే మరణించిన ప్రముఖ సింగర్ !
కొంతకాలంగా… ‘అనుపమ పరమేశ్వరన్’ టాలీవుడ్ లోనూ, కోలీవుడ్ లోనూ సెకండ్ హీరోయిన్ రోల్స్ కే పరిమితమైంది. దీనికి కారణం ఒకే ఒక్కటి. ఆమె తన శరీరాన్ని భారీగా పెంచేయడమే. నిజానికి గ్లామరస్ బొద్దుగుమ్మల్ని కోలీవుడ్ జనం ఎక్కువగా ఇష్టపడేతారు. ‘అనుపమ’కి ఈ క్వాలిఫికేషన్ ఉన్నా సరే.. ఆమె గ్లామర్ ను ఒలికించదు కాబట్టి ఆమె పై ఆసక్తి చూపించలేదు అరవ జనం.
మొత్తమ్మీద అనుపమ పెర్ఫార్మర్ గానే మిగిలిపోయింది. తెలుగులోనూ కూడా ఇదే కారణంతో అనుపమ బాగా వెనుకబడింది. అలాంటి అనుపమ.. ఇప్పుడు పూర్తిగా తన స్వరూపాన్నే మార్చేసుకుంది. అందరూ షాకయ్యే స్లిమ్ మేకోవర్ తో మెరిసిపోతుంది. పైగా బోల్డ్ కామెంట్స్ తో రెచ్చిపోతుంది.
Also Read: Chandrababu: చంద్రబాబు భారీ స్కెచ్.. ఏపీకి పది నెలలు అంకితం
Recommended Videos:
[…] Also Read: Heroine Bold Comments: నేను సింగిల్ కాదు, మింగిల్.… […]
[…] Also Read: Heroine Bold Comments: నేను సింగిల్ కాదు, మింగిల్.… […]
[…] Also Read: Heroine Bold Comments: నేను సింగిల్ కాదు, మింగిల్.… […]