Ileana: ‘అవసరం కోసం అడ్డదారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరీ నాటకంలో.. ‘ అన్నట్టు ఉంటుంది ఫేడ్ అవుట్ హీరోయిన్ల వ్యవహార శైలి. ఒకప్పుడు పిలిచి మరీ ఛాన్స్ ఇస్తే.. నో అంటూ సరిగ్గా సమాధానం కూడా చెప్పలేదు. ఇప్పుడు పర్సనల్ లైఫ్ లో ఆటుపోట్లు ఎదుర్కొని.. మళ్ళీ సినిమాల్లో బిజీ కావాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది గోవా సుందరి ఇలియానా.

పాత సామెత ఒకటి ఉంది. ‘బాగా ఆకలి వేస్తే, సింహం కూడా గడ్డి తింటుంది’ అని, సరిగ్గా ఇప్పుడు ఇలియానా పరిస్థితి కూడా అలాగే ఉంది. కరెక్ట్ గా రెండు సంవత్సరాల క్రితం ఓ సినిమాలో గెస్ట్ హీరోయిన్ గా నటించండి అని ఆ సినిమా మేకర్స్ వెళ్లి రిక్వెస్ట్ చేస్తే.. నేనా ? గెస్ట్ హీరోయిన్ గానా ? అంటూ హేళన చేసింది ఇలియానా. పైగా నేను ప్రధాన పాత్రలు తప్ప, మరే ఇతర పాత్రలు చేయను అంటూ క్లారిటీ ఇచ్చింది.
అలాంటి హీరోయిన్ ఐటమ్ పాత్రలు ఎందుకు చేస్తోంది ? అందుకే, ఆ మధ్య నితిన్ హీరోగా వచ్చిన అంథాదూన్ రీమేక్ లో మొదట తమన్నా పాత్ర కోసం ఇలియానానే అడిగారు. అడిగిన వెంటనే.. నో అనేసింది. కానీ రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా..! అందుకే ఇలియానాలో మార్పు వచ్చింది. ఎలాగూ వయసు కూడా పెరిగింది.
మరో మూడేళ్లు దాటితే.. ఇక ఆ తర్వాత ఆ ఐటమ్ సాంగ్స్ కూడా రావు అని ఇలియానాకి ఫుల్ క్లారిటీ వచ్చింది. అందుకే మళ్ళీ సినిమాల్లో ముఖ్యంగా తెలుగు సినిమాల్లో బిజీ కావాలని కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలోనే ఒక ఐటమ్ సాంగ్ కు కూడా రెడీ అయింది. రవితేజ హీరోగా నక్కిన త్రినాధ్ రావు దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతుంది.
కాగా ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉంది. సెకండ్ హాఫ్ లో వచ్చే ఈ సాంగ్ లో ఇలియానా నటించబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఇలియానా తన మనసు మార్చుకుని ఐటమ్ సాంగ్ లు చేయడానికి కూడా సిద్ధం అయింది. మరి హీరోయిన్ గా మళ్ళీ ఫామ్ లోకి వస్తోందేమో చూడాలి.