NTR: మన స్టార్ హీరోలకు రియల్ ఎస్టేట్ బిజినెస్ కు అవినాభావ సంబంధం ఉంది. చాలామంది హీరోలు తమ సంపాదన అంతా భూమి మీదే పెట్టుబడి పెడుతున్నారు. శోభన్ బాబు విజయ సూత్రం ఇదే కావడంతో మొత్తానికి సినిమా వాళ్లకు భూమి విలువ బాగా తెలిసొచ్చింది. అందుకే, స్టార్ హీరోలు ఫామ్ హౌస్ ల పేరట పది పదిహేను ఎకరాలు కొనేసుకుని, దానిలో ఏవో చిన్నాచితకా కార్యక్రమాలు చేస్తూ.. మొత్తానికి భూమి విలువును పెంచడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఆ మధ్య జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్ శివార్లలో ఓ స్థలం కొన్న సంగతి తెలిసిందే. కరెక్ట్ గా చెప్పుకుంటే.. హైదరాబాద్ శివార్లలోని శంకర్ పల్లికి దగ్గర్లో ఉన్న గోపాలపురంలో ఎన్టీఆర్ ఆరు ఎకరాల భూమి కొనుగోలు చేశాడు. ఈ ఫామ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ సమయంలోనే ఎన్టీఆర్ స్వయంగా రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు వెళ్లారు. అక్కడ పత్రాల పై వేలిముద్రలు, సంతకాలు పెట్టే సమయంలో అక్కడ స్టాప్ తో ఎన్టీఆర్ ఫోటోలు దిగారు, అవి బాగా వైరల్ అయ్యాయి.
అయితే, ఎన్టీఆర్ ఆ ఆరు ఎకరాల భూమిలో ఒక ఫామ్ హౌస్ ను అభివృద్ధి చేయడానికి ఆ మధ్య కసరత్తులు మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఆ ఫామ్ హౌస్ కి సంబంధించిన పనులు దాదాపు పూర్తి అయ్యాయని తెలుస్తోంది. ఆ పనులు తాలూకు వ్యవహారాలన్నింటినీ ఎన్టీఆర్ సతీమణి ప్రణీత దగ్గర ఉండి చూసుకుంటుందట.
ప్రణీత తన అభిరుచికి తగ్గట్టు ఆ ఫామ్ హౌస్ ను కట్టించింది అని, పైగా ఆ ఫామ్ హౌస్ లో కుటుంబానికి సరిపడ కాయకూరగాయలను కూడా పండిస్తున్నారని తెలుస్తోంది. ఇందుకు గానూ జీతం ఇచ్చి మరీ యువ రైతులను పెట్టుకున్నారట. అంటే… పూర్తి ఆర్గానిక్ పద్దతిలో ఆ యువ రైతులు పంటను పండిస్తారు అన్నమాట. ఇక ఎన్టీఆర్ ఫామ్ హౌస్ కి దగ్గరలోనే పవన్ కల్యాణ్ ఫామ్ హౌస్ కూడా ఉంది.
అలాగే మిగిలిన కొంతమంది హీరోల ల్యాండ్స్ కూడా అదే ఏరియాలో ఉన్నాయట. మొత్తానికి హీరోల ఫామ్ హౌస్ లు ఆ ఏరియాలో ఉండటంతో ఇప్పుడు ఆ ఏరియాలో భూమి విలువ బాగా పెరిగింది. అన్నట్టు కొంతమంది నాగార్జున, చరణ్, సందీప్ కిషన్ లాంటి మరికొందరు హీరోలు రెస్టారెంట్లలో, క్రీడా ఫ్రాంచైజీల్లో పెట్టుబడులు పెడుతూ ముందుకు వెళ్తున్నారు.