https://oktelugu.com/

Ilaiyaraaja: అవును, నేనూ ప్రేమించాను – ఇళయరాజా

Ilaiyaraaja: మాస్ట్రో ఇళయరాజా అంటేనే సంగీత ప్రపంచంలో తిరుగులేని మేటి. ఎందుకంటే.. ఆయన సంగీతంలో ఒక ఉత్తేజం ఉంటుంది. ఆయన స్వరంలో ఒక ‘ఉత్సాహాం ఉంటుంది. అన్నిటికి మించి ఇళయరాజా ఎప్పుడు సీరియస్ గా ఉంటారు. ఆయన మధురమైన ప్రేమ పాటలను సృష్టిస్తాడు గానీ, ఆయన జీవితంలో ప్రేమ లేదు అని ఇన్నాళ్లు ఒక ప్రచారం జరిగింది. అయితే, ఇళయరాజా మాట్లాడుతూ.. తానూ ప్రేమించానని, అయితే అది పలు విధాలుగా ఉంటుందన్నారు. అయితే, ఆయన అభిమానులు మాత్రం […]

Written By:
  • Shiva
  • , Updated On : March 22, 2022 / 12:24 PM IST
    Follow us on

    Ilaiyaraaja: మాస్ట్రో ఇళయరాజా అంటేనే సంగీత ప్రపంచంలో తిరుగులేని మేటి. ఎందుకంటే.. ఆయన సంగీతంలో ఒక ఉత్తేజం ఉంటుంది. ఆయన స్వరంలో ఒక ‘ఉత్సాహాం ఉంటుంది. అన్నిటికి మించి ఇళయరాజా ఎప్పుడు సీరియస్ గా ఉంటారు. ఆయన మధురమైన ప్రేమ పాటలను సృష్టిస్తాడు గానీ, ఆయన జీవితంలో ప్రేమ లేదు అని ఇన్నాళ్లు ఒక ప్రచారం జరిగింది.

    Ilaiyaraaja

    అయితే, ఇళయరాజా మాట్లాడుతూ.. తానూ ప్రేమించానని, అయితే అది పలు విధాలుగా ఉంటుందన్నారు. అయితే, ఆయన అభిమానులు మాత్రం ఇళయరాజా గొప్ప ప్రేమికుడు అని అందుకే.. ఆయన గొప్ప ప్రేమ పాటలను అందించారు అని చెబుతున్నారు. ఇక చెన్నైలో సొంతంగా ఒక రికార్డింగ్ స్టూడియో కట్టుకోవాలని ఇళయరాజా చిరకాల కోరిక అట.

    Also Read: Virata Parvam Movie: ఇంకా అజ్ఞాతంలోనే మగ్గిపోతున్న ‘విరాటపర్వం’

    మొత్తానికి ఇటీవల తన కోరికను ఆయన తీర్చుకున్నారు. ఇక ఇళయరాజా స్టూడియోని చూసేందుకు పలువురు సినీ ప్రముఖులు విచ్చేస్తున్నారు. ఆ మధ్య సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పటికే వచ్చి వెళ్లారు. ఇక ఇళయరాజా సొంతంగా నందంబాక్కంలోని కామ దార్ నగర్ రోడ్ లో స్టూడియో కట్టుకోవడానికి వేరే కారణం ఉందట. ఇళయరాజా చాలా కాలం చెన్నైలోని ప్రసాద్ స్టూడియోలోనే తన పాటల రికార్డింగ్ జరిపేవారు.

    Ilaiyaraaja

    కాకపోతే ఇటీవల ప్రసాద్ స్టూడియో యాజమాన్యంతో ఇళయరాజాకు గొడవ అయింది. ఆ గొడవ తర్వాత ప్రసాద్ యాజమాన్యం, రాజాని అక్కడ నుండి వెకేట్ చేయించారు. దాంతో ఆయన అది అవమానంగా భావించి, వారికీ పోటీగా ఒక రికార్డింగ్ స్టూడియో పెట్టాలని కసితో ఈ స్టూడియో కట్టారని అంటుంటారు.

    Also Read: Kotha Bangaru Lokam: ‘కొత్త బంగారు లోకం’ మూవీని మిస్ చేసుకున్న స్టార్ హీరో కుమారుడు

    Recommended Video:

    Tags