Mehreen Kaur Pirzada: బబ్లీ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా కెరీర్ గ్రాఫ్ మొదటి నుంచి మిగిలిన హీరోయిన్స్ కంటే భిన్నంగా వస్తూ ఉంది. అయితే, తాజాగా ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఆమె మాటల్లోనే.. ”మా హీరోయిన్ల జీవితాలు చాలా గందరగోళం. చిత్ర విచిత్రంగా సాగుతాయి. దీనికితోడు సినిమాల్లోని పాత్రలకు తగ్గట్టు లుక్స్ మార్చాలి. శారీరకంగా కఠినమైన శిక్షణ తీసుకోవాలి.

ముఖ్యంగా మా జీవనశైలిలో కొత్త కొత్త మార్పులు వెరీ కామన్ గా జరుగుతూ ఉంటాయి. అన్నిటికీ మించి రాత్రికి రాత్రే మా జీవితాలు మారిపోతాయి. విజయం దక్కిందని సంతోషపడే లోపే వైఫల్యం ఎదుర్కొంటూ ఉంటాం. సినిమాల కోసం కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులకు దూరంగా ఉండాల్సి వస్తుంది. అయినా ఉంటాం.
Also Read: ‘కొత్త బంగారు లోకం’ మూవీని మిస్ చేసుకున్న స్టార్ హీరో కుమారుడు
ఇంకా మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కారణంగా ఎన్నో భరిస్తాం. అయినా అన్నీ తెలిసి కూడా మేము ఈ రంగాన్నే ఎంచుకుంటాం” అంటూ మెహ్రీన్ తాజాగా తన పోస్టులో రాసుకొచ్చింది. ఏది ఏమైనా మెహ్రీన్ కి హిట్లు లేవు, నిజానికి ఆమె ఫేడ్ అవుట్ దశలోకి వెళ్ళిపోతుంది. ఇక ఛాన్స్ లు రావడం ఆగిపోయాయి అనుకున్న సమయంలో.. మళ్ళీ సడెన్ గా మెహ్రీన్ పిర్జాదాకి వరుస ఛాన్స్ లు వస్తాయి.
మరి ఈ ఛాన్స్ లు వెనుక ఎవరు ఉన్నారో తెలియదు గానీ, మెహ్రీన్ పిర్జాదాకి కెరీర్ అయిపోయిందనే పరిస్థితిలోనే మళ్ళీ ఆమె కెరీర్ మొదలవుతుంది. అసలు టాలెంట్ లేకపోయినా ఎక్స్ ప్రెషన్స్ పలికించలేకపోయనా ఎక్స్ పోజింగ్ తో తన గ్లామర్ తో మొత్తానికి బండిని నడిపిస్తూ వస్తోంది. పైగా ఈ బబ్లీ బ్యూటీ టాలీవుడ్ లో ఛాన్స్ లతో పాటు బాగా క్యాష్ చేసుకుంటుంది.

నిజానికి గత నాలుగేళ్లుగా తెలుగులో మెహ్రీన్ పిర్జాదాకు చెప్పుకోదగ్గ స్థాయిలో అవకాశాలు రాలేదు. తన హవా టాలీవుడ్ లో తగ్గుముఖం పట్టిందని అర్ధం అవ్వగానే రూట్ మారుస్తోంది. కొన్ని నెలల పాటు తమిళంలో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తోంది. అక్కడ చేస్తూనే.. తెలుగులోని తన సన్నిహిత హీరోలతో, దర్శకులతో నిత్యం టచ్ లో ఉంటుంది.