BigBoss Show: టీవీ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న షో బిగ్ బాస్. ఒకప్పుడు కేవలం సీరియల్స్, సినిమాలు మాత్రమే చూసేవాళ్ళు.. ఇప్పుడు ప్రతిరోజు బిగ్ బాస్ షో చూడకుండా నిద్రపోవడం లేదు. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా కొందరు వ్యక్తులు ఒకే గదిలో ఉంటే వారి ఆహా భావాలు ఎలా ఉంటాయో బిగ్ బాస్ ద్వారా తెలుసుకోవాలని చాలామంది ఉత్సాహం చూపిస్తారు. అయితే ఈ ఆహా భావాలు ఒక్కోసారి పరిమితి నుంచి గొడవలకు దారి తీస్తాయి. కొందరు తమ విచక్షణాన్ని విడిచిపెట్టి వాదనలు చేసుకుంటారు. అయితే ప్రేక్షకులు మాత్రం ఇవి నిజమైన గొడవలా? లేక యాక్షన్ చేస్తున్నారా? అనేది చాలామందికి తెలియకుండా ఉంటుంది. కానీ అసలు విషయం ఏంటంటే బిగ్ బాస్ కంటెస్టెంట్ల గొడవ వల్ల వారికి యాజమాన్యానికి మాత్రం కోట్ల రూపాయల ఆదాయాన్ని కురిపిస్తుంది. అది ఎలాగో తెలిస్తే ఆశ్చర్య పోవడం ఖాయం..
ప్రతి సంవత్సరం బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అవుతుందంటే కొందరి యువతలో ఉత్సాహం అధికంగా ఉంటుంది. ఎందుకంటే బిగ్ బాస్ కంటెస్టెంట్ల ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది. బిగ్బాస్ కంటెస్టెంట్లు హౌస్ లోకి వెళ్లే ముందు నార్మల్గా ఉంటారు. కానీ ఇందులోకి వెళ్లిన తర్వాత ఒత్తిడి.. ఇతర వాతావరణం వల్ల అసహనానికి గురవుతూ ఉంటారు. సాధారణంగా మాట్లాడుకోవడం మానేసి అరుస్తూ ఉంటారు. ఒకేసారి నవ్వుతూ ఉంటారు. ఒకేసారి ప్రేమలు కురిపిస్తూ ఉంటారు. మరికొన్నిసార్లు వారి పర్సనల్ విషయాలు చెబుతూ ఎమోషన్ కు ఫీలవుతారు.
కానీ వీటన్నిటికంటే గొడవల వల్ల బిగ్ బాస్ యాజమాన్యానికి అధిక ఆదాయం వస్తుందన్న విషయం చాలామందికి తెలియదు. అంతేకాకుండా కంటెస్టెంట్ల మధ్య గొడవలు సృష్టించి బిగ్బాస్ యాజమాన్యం కోట్ల రూపాయల ఆదాయాన్ని తెచ్చుకుంటుంది. కంటెస్టెంట్లకు తెలియకుండానే కొన్ని గొడవలు అయ్యే టాస్కులను విధిస్తారు. ఈ టాస్కులతో వారికి గొడవ అవుతుంది. బిగ్బాస్ 13 సీజన్లో అలీ మియా, సిద్ధార్థ శుక్ల మధ్య గొడవ జరిగింది. అయితే ఈ గొడవకు ముందు కలర్స్ టీవీ టిఆర్పి రేటింగ్ 65 లక్షల వరకు ఉండేది. కానీ ఆ తర్వాత టిఆర్పి రేటింగ్ కోటికి పైగా పెరిగింది. దీంతో యాడ్స్ రేటింగ్ పెరిగి విపరీతమైన ఆదాయం వచ్చింది. అంతేకాకుండా కలర్స్ టీవీకి కొత్త కాంట్రాక్టులు కూడా ఏర్పడ్డాయి.
అంటే బిగ్బాస్ సీజన్ లో కంటెస్టెంట్ల మధ్య కావాలని గొడవలు సృష్టించి… ఆ గొడవల ద్వారా అధిక ఆదాయాన్ని పొందుతున్నారు. కానీ ఈ విషయం మాత్రం కంటెస్టెంట్లకు తెలియదు. వారికి ఇచ్చే ఆదాయంతో వారు ఎంతో సంతృప్తి చెందుతున్నారు. అయితే వారి ఎమోషన్తో బిగ్ బాస్ యాజమాన్యం కోట్ల రూపాయల వరకు ఆదాయాన్ని పొందుతుంది. ప్రేక్షకులు సైతం దీనిని ఒక ఎంటర్టైన్మెంట్ గాని చూస్తున్నారే తప్ప.. దీని వెనక ఎంత బిజినెస్ జరుగుతుందో చాలామందికి తెలియదు. అయితే ఒక్కోసారి బిగ్ బాస్ కంటెస్టెంట్ల మధ్య గొడవలు తారస్థాయికి వెళ్లి.. పెద్దవిగా మారే అవకాశాలు ఉన్నాయి. కొందరు కంటెస్టెంట్లు ఈ గొడవలకు తట్టుకోలేక బయటకు వెళ్లిన సంఘటనలు కూడా ఉన్నాయి.