Sandeep Reddy Vanga : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఎప్పుడైతే అర్జున్ రెడ్డి సినిమా వచ్చిందో అప్పటినుంచి సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడు తన సినిమా మేకింగ్ తో ప్రేక్షకులందరిని మెప్పించడమే కాకుండా ఆయనకంటూ ఉన్న ఒక స్టైల్ ని ప్రేక్షకులకు పరిచయం చేశారనే చెప్పాలి. మరి ఆయన చేసిన ప్రతి సినిమా యావత్ ప్రేక్షకులందరిని మెప్పించడమే కాకుండా ఆయనకంటూ ఉన్న ఒక స్టైల్ ని ప్రేక్షకులకు పరిచయం చేస్తూ వస్తుంది. మరి ఇలాంటి సందర్భంలోనే సందీప్ రెడ్డివంగా ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. మరి ఇదిలా ఉంటే సందీప్ మొదటి సినిమా అయిన అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ అయిన సందర్భంలో అందులో కొంచెం బోల్డ్ కంటెంట్ ఎక్కువ గా ఉందని చాలామంది ఆ సినిమాను అడ్డుకుంటున్నారు అంటూ ఒక ఇంటర్వ్యూ లో అతనితో యాంకర్ మాట్లాడుతూ దీనివల్ల మీ నెక్స్ట్ సినిమాకి ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు అనుకుంటున్నారా అని అడగానే ఆయన మాట్లాడుతూ నన్ను ఇక్కడ అడ్డుకుంటే నేను హిందీలో సినిమా తీస్తా, అక్కడ కూడా అడ్డుకుంటే మలయాళంలో తీస్తా లేదా కన్నడలో, తమిళ్ లో తీస్తా అన్ని రకాల భాషలు నాకు వచ్చు ఇక ఇండియాలోనే నా సినిమాలను బ్యాన్ చేయగలిగితే నేను హాలీవుడ్ కి వెళ్ళైన సరే సినిమా తీస్తా… అంతే తప్ప నేను సినిమా తీయకుండా నన్ను ఎవరు ఆపలేరు అంటూ ఆయన ఇంటర్వ్యూలో చెప్పిన సమాధానం చాలామందిలో కాన్ఫిడెన్స్ ను నింపడమే కాకుండా ఆయన ఎంత కాన్ఫిడెంట్ గా ఉంటాడో అందరికి తెలియజేసింది…
సినిమానే ప్రాణంగా బతికే సందీప్ ఎక్కడైనా సరే తను సినిమాను తీసుకొని దాన్ని రిలీజ్ చేయగలిగే కెపాసిటీ తనకు ఉందని ఇంటర్వ్యూలో తెలియజేయడం విశేషం…మరి ఏది ఏమైనా కూడా అలాంటి దర్శకులు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారనే చెప్పాలి.
అందుకే ఇండస్ట్రీలో అతనికి చాలా మంది దర్శకులు కూడా అభిమానులుగా మారారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక మొత్తానికైతే ఆయన అనిమల్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న విషయం మనకు తెలిసిందే.
ఇక రణ్బీర్ కపూర్ కెరియర్ లోనే ది బెస్ట్ సక్సెస్ అందించిన ఆయన ప్రస్తుతం తనదైన రీతిలో ముందుకు సాగడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు. ఇక స్పిరిట్ సినిమాతో ప్రభాస్ కి అరుదైన సక్సెస్ ని అందించి ఆయన కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుగా ఈ సినిమాను నిలపాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది…
