https://oktelugu.com/

Salaar 2: సాలర్ 2 బడ్జెట్ ఎంతో తెలిస్తే దిమ్మ దిరగాల్సిందే…

ఈ సినిమాను వచ్చే సంవత్సరం సమ్మర్ కి సెట్స్ మీదకి తీసుకెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే 2026 వ సంవత్సరం లో సంక్రాంతి కనుక ఈ సినిమాని బరిలో నిలపాలనే ప్రయత్నం లో ప్రశాంత్ నీల్ ఉన్నట్టుగా తెలుస్తుంది.

Written By:
  • Gopi
  • , Updated On : May 6, 2024 / 01:44 PM IST

    If you know the budget of Salaar 2

    Follow us on

    ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన తర్వాత కొద్దిసంవత్సరాల పాటు ఆయనకు సరైన సక్సెస్ అయితే దక్కలేదు. ఇక గత సంవత్సరం చివర్లో వచ్చిన సలార్ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవడమే కాకుండా దాదాపు 800 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టి మరోసారి తన స్టామినా ఏంటో చూపించుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు ఆయన వరుసగా కొన్ని ప్రాజెక్టులను చేస్తున్నప్పటికీ నెక్స్ట్ సలార్ 2 సినిమా మీద ఫోకస్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.

    అయితే ఈ సినిమాను వచ్చే సంవత్సరం సమ్మర్ కి సెట్స్ మీదకి తీసుకెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే 2026 వ సంవత్సరం లో సంక్రాంతి కనుక ఈ సినిమాని బరిలో నిలపాలనే ప్రయత్నం లో ప్రశాంత్ నీల్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమా బడ్జెట్ భారీగా పెరిగే అవకాశాలైతే ఉన్నాయి. ఇక మొదటి పార్ట్ కోసం దాదాపు 300 కోట్ల బడ్జెట్ ని పెట్టారు. ఇక ఈ సినిమా కోసం ఏకంగా 500 కోట్ల బడ్జెట్ పెట్టాల్సిన అవసరమైతే ఉంది.

    ఎందుకంటే ‘శౌర్యంగా పర్వం’ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాని చాలా గ్రాండ్ గా తీయాల్సిన అవసరమైతే ఉంది. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ ని చాలా రిచ్ లుక్ లో చూపించాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి దానికోసం భారీగా ఖర్చు పెట్టాలి. ఇక సలార్ సినిమాలో మిగిలిపోయిన ప్రశ్నలకు ఈ సినిమాలో ప్రశాంత్ నీల్ సమాధానం చెప్పాల్సిన అవసరమైతే ఉంది.

    కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా బడ్జెట్ ను భారీగా పెంచేసినట్టుగా తెలుస్తుంది… అయితే ఈ సినిమాకి ఉన్న హైప్ ను బట్టి ఈ సినిమా దాదాపు 1500 కోట్ల వరకు వసూళ్లను కలెక్ట్ చేసే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి ఈ సినిమా మీద భారీ బడ్జెట్ ను కూడా పెట్టడానికి ప్రొడ్యూసర్లు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది…