రొట్ట కొట్టుడుతో ముందుకు పోతే ప్లాప్ లే వస్తాయ్ !

కరోనా పుణ్యమా అని సినిమా ఇండస్ట్రీ మొత్తం స్తంభించిపోయింది. అసలుకే తెలుగు స్టార్ హీరోలు ఎంత స్పీడ్ గా పని చేసినా.. సంవత్సరానికి వాళ్ళు చేసేదే కేవలం ఒక్క సినిమా. అంతకు మించి వాళ్ళు నుండి ఎక్కువ సినిమాలు ఆశించడం అత్యాశే అవుతుంది. నిజానికి ఫలానా స్టార్ హీరో నుండి సంవత్సరానికి ఒక్క సినిమా అయినా గ్యారంటీగా వస్తోందని కూడా నమ్మకంగా చెప్పలేని పరిస్థితి ఉంది. అలాంటి కాలంలో ఈ కరోనా వచ్చి అసలుకే మోసం చేసింది. […]

Written By: admin, Updated On : December 9, 2020 6:15 pm
Follow us on


కరోనా పుణ్యమా అని సినిమా ఇండస్ట్రీ మొత్తం స్తంభించిపోయింది. అసలుకే తెలుగు స్టార్ హీరోలు ఎంత స్పీడ్ గా పని చేసినా.. సంవత్సరానికి వాళ్ళు చేసేదే కేవలం ఒక్క సినిమా. అంతకు మించి వాళ్ళు నుండి ఎక్కువ సినిమాలు ఆశించడం అత్యాశే అవుతుంది. నిజానికి ఫలానా స్టార్ హీరో నుండి సంవత్సరానికి ఒక్క సినిమా అయినా గ్యారంటీగా వస్తోందని కూడా నమ్మకంగా చెప్పలేని పరిస్థితి ఉంది. అలాంటి కాలంలో ఈ కరోనా వచ్చి అసలుకే మోసం చేసింది. రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు ఇంకా ఆలస్యం అయ్యాయి. పోనీ, కరోనా ప్రభావం కాస్త తగ్గింది కదా.. మన స్టార్స్ స్పీడ్ పెంచాలనేది సగటు అభిమాని ఫీల్ అవుతున్నాడు.

Also Read: ఇంగ్లీష్ సినిమాని కాపీ చేస్తోన్న సీనియర్ హీరో !

కానీ మొన్న పుష్ప సినిమా షూట్ కి వెళ్ళితే.. దాదాపు ఇరవై మందికి కరోనా సోకడంతో సినిమా షూటింగ్ ఆపేసి.. ఇంటికి వచ్చేశారు. ఇప్పుడు పెద్ద సినిమాల పరిస్థితి అంతా అలాగే ఉంది. అదే ఆ రోజుల్లో సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్‌, కృష్ణ, శోభన్‌ బాబు లాంటి లెజండరీ హీరోలంతా జయాపజయాలకు అతీతంగా, అలాగే వరదలు అవాంతరాలుకు సంబంధం లేకుండా సంవత్సరానికి ఐదు నుండి ఎనిమిది సినిమాలు చేస్తూ.. అందరికీ పని కల్పించేవాళ్ళు. సూపర్ స్టార్ కృష్ణ అయితే హీరోగా నటిస్తూ ఓ ఏడాదిన ఏకంగా పదిహేను సినిమాలను పూర్తి చేశాడట. బహుశా ఈ రికార్డ్ ఇక బద్దలు కొట్టడం అసాధ్యమే.

Also Read: ‘ఆర్‌ఆర్‌ఆర్’లో టాలెంటెడ్ కమెడియన్ కూడా కీలకమేనట !

ఇప్పటి స్టార్స్‌ గ్యాప్ లేకుండా రోజూ అన్ని సినిమాల్లో నటించడం అయ్యే పని కాదు. పోనీ అందులో సగం సినిమాలు అయినా చేస్తారా అంటే.. అది కూడా సాధ్యమయ్యే పని కాదు. పైగా ఇప్పటి హీరోలు స్టార్ల అనే రొటీన్ ఇమేజ్‌ చట్రాల మధ్య నలిగిపోతూ తమకు తామూ పరిధి సృష్టించుకుని అక్కడక్కడే తిరుగుతూ .. అవే కథలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అయినా అన్ని వర్గాల ప్రేక్షకుల అభిరుచులను అందుకుని అందర్నీ ఆకట్టుకోవడానికి మన హీరోలు ప్రయత్నం చేయాలని గానీ, మా ఫ్యాన్స్ కోసం చేస్తోన్న సినిమా ఇది అంటూ.. అదే రొట్ట కొట్టుడు సినిమాలు చేసుకుంటూ పోతే చివరకు ప్లాప్ లు గాక ఏమి వస్తాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్