
సినిమా ఇండస్ట్రీలో హీరోలతో పోల్చుకుంటే, హీరోయిన్స్ కి అస్సలు అంతగా ప్రాముఖ్యత ఏమి ఉండదు. ఆ మాటకొస్తే, ఎంత గొప్ప నటి అయినా.. హీరో ముందు జీరోనే. మహానటి అంటూ సావిత్రి గురించి ఇప్పుడు గొప్పగా వర్ణించుకుంటాము.. అలాగే ఆమె గొప్ప స్టార్ అంటూ బయోపిక్ లో కూడా చూపించుకుంటాము గాని, అప్పటి వాస్తవ పరిస్థుతులు వేరు. వాస్తవంగా జరిగింది వేరు. అంతగా ఇండస్ట్రీలో ఆడా మగా అనే తేడా ఉంటుంది. అయితే ఒక గొప్ప సినిమా తీసిన డైరెక్టర్ కు ఎప్పుడూ విలువ ఉంది. కాకపోతే లేడీ డైరెక్టర్ ఆ విలువలో కొంత షేర్ ఇవ్వాల్సి వస్తోంది. అసలు లేడీ డైరెక్టర్ అనగానే చిన్న సినిమాలు, రొమాంటిక్ చిత్రాలు మాత్రమే తియ్యగలరు అని ఎప్పుడో ఓ ముద్ర వేసేశారు.
Also Read: మెగాస్టార్ ‘వేదాళం’ మాటలు మొదలు !
ఒకవేళ ఓ లేడీ డైరెక్టర్ ఒక గొప్ప కమర్షియల్ హిట్ సినిమా తీస్తే.. ఇక ఆమెను కూడా లేడీ డైరెక్టర్ గా చూడటం మానేస్తారు. మగాడిగా ప్రమోషన్ ఇచ్చేస్తారు. నందినీ రెడ్డికి అలాగే క్రెడిట్ ఇచ్చారు. సుధా కొంగర పరిస్థితి ఇప్పుడు అదే అయిపొయింది. 50 ఏళ్ల ఈ దర్శకురాలది మన తెలుగు గడ్డే. కానీ చెన్నైలోనే సినిమా ప్రస్థానం ప్రారంభించింది. ఇక ఆమె తీసిన తాజా చిత్రం “ఆకాశం నీ హద్దు రా” మంచి ప్రశంసలు అందుకుంటూ.. రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. నిజానికి ఈ సినిమాకి ముందువరకూ ఓటిటిలో ఒక సినిమా డైరెక్ట్ గా రిలీజ్ అయిందంటే.. ఇక అది బ్యాడ్ మూవీనే అనే అభిప్రాయం బలంగా నాటుకుపోయింది.
Also Read: తరుణ్ తో వ్యవహారం బయటపెట్టిన హీరోయిన్ !
అలాంటి నెగిటివ్ అభిప్రాయాల మధ్య విడుదల అయిన ఈ సినిమా, విమర్శకుల నుంచి కూడా మంచి రేటింగ్స్ పొందింది అంటే.. అది సుధా కొంగర గొప్పతనమే. ఇదే సినిమాని మరో మగ డైరెక్టర్ గాని తీసి ఉంటే.. ఈ పాటికి అతనికి ఓ రేంజ్ లో ప్రశంసలు వచ్చేవి. కానీ సినిమాని తీసింది లేడీ కదా.. అందుకే సినిమా అద్భుతంగా ఉన్నా.. సినిమా వాళ్ళు ఎక్కువమంది తమ ప్రశంసలను బాహాటంగా చెప్పడానికి ఆలోచిస్తున్నారు. బట్ ఏది ఏమైనా సూర్యలాంటి స్టార్ ని పెట్టి.. గొప్ప ఎమోషనల్ డ్రామాని తెరకెక్కించడం.. ఒక్క సుధా కొంగరకే సాధ్యం అయింది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్