https://oktelugu.com/

ట్విస్ట్: పుష్ప-1 హిట్ అయితేనే పుష్ప-2 నా?

టాలీవుడ్ లో ఇప్పుడు బన్నీని పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టేందుకు మంచి కథా, కథనంతో రెడీ అయ్యాడు దర్శకుడు సుకుమార్. ఈ క్రియేటివి దర్శకుడు తీస్తున్న ‘పుష్ఫ’ మూవీని రెండు భాగాలుగా ‘బాహుబలి’లా తీస్తున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై బోలెడు అంచనాలున్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు అదిరిపోయేలా స్పందన వచ్చింది. పుష్ప-1 సినిమాను ఆగస్టులో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే కరోనా లాక్ డౌన్ తో సినిమా షూటింగ్ వాయిదా పడింది. […]

Written By: , Updated On : June 16, 2021 / 12:07 PM IST
Follow us on

టాలీవుడ్ లో ఇప్పుడు బన్నీని పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టేందుకు మంచి కథా, కథనంతో రెడీ అయ్యాడు దర్శకుడు సుకుమార్. ఈ క్రియేటివి దర్శకుడు తీస్తున్న ‘పుష్ఫ’ మూవీని రెండు భాగాలుగా ‘బాహుబలి’లా తీస్తున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై బోలెడు అంచనాలున్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు అదిరిపోయేలా స్పందన వచ్చింది.

పుష్ప-1 సినిమాను ఆగస్టులో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే కరోనా లాక్ డౌన్ తో సినిమా షూటింగ్ వాయిదా పడింది. దీంతో సినిమా కూడా వాయిదా పడింది. ప్రస్తుతం చూస్తే పుష్ప సినిమా 2022లో తప్ప.. ఆలోగా వచ్చే చాన్సే లేదు.

ఇక్కడే ఓ ట్విస్ట్ ఉందట.. అల్లు అర్జున్ సన్నిహితుడైన బన్నీ వాసు తాజాగా హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప1 మూవీ తీసిన తర్వాత పుష్ప2 కోసం అల్లు అర్జున్ గ్యాప్ తీసుకుంటాడని తెలిపాడు. ఆ గ్యాప్ లో వేరే సినిమా చేస్తాడని వివరించాడు.

ఇక సుకుమార్ కూడా బన్నీవాసు అడ్వాన్స్ ఇచ్చాడట.. కేదార్ అనే నిర్మాతతో సుకుమార్ ఓ సినిమా చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నాడు. సో పుష్ప1 హిట్ అయితేనే రెండో సినిమా పట్టాలెక్కుతుందన్న మాట.. హిట్ కాకపోతే అటు బన్నీ ఇటు సుకుమార్ ఇద్దరూ వేర్వేరు సినిమాలు చేసుకుంటూ పోతారు. బన్నీ ‘అల వైకుంఠపురంలో’ తర్వాత త్రివిక్రమ్ తోనూ ఓ సినిమా కమిట్ అయ్యాడు. సో పుష్ప హిట్ మీదనే సుక్కు, బన్నీ భవిష్యత్ ఆధారపడి ఉందన్న మాట..