https://oktelugu.com/

Prabhas Adipurush: ప్రభాస్ ఆరోజు ఆ నిర్ణయం తీసుకొని ఉండకపొయ్యుంటే ‘ఆదిపురుష్’ కి ఈ మాత్రం వసూళ్లు కూడా వచ్చేవి కాదా?

గ్రాఫిక్స్ మొత్తం కార్టూన్ నెట్వర్క్ లో ఉండే కార్టూన్ బొమ్మలు లాగ ఉన్నాయి, నిజంగా ఈ సినిమాకి 500 కోట్లు ఖర్చు చేసారా అంటూ కామెంట్స్ వినిపించాయి.

Written By:
  • Vicky
  • , Updated On : June 22, 2023 / 12:21 PM IST

    Prabhas Adipurush

    Follow us on

    Prabhas Adipurush: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై ఆ అంచనాలను అందుకోలేకపోయిన సంగతి తెలిసిందే. మొదటి మూడు రోజులు టాక్ తో సంబంధం లేకపోయినా అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ ఆ తర్వాత నుండి అన్నీ బాషలలో వసూళ్లు దారుణంగా పడిపోయాయి. అయితే ఈ సినిమా టీజర్ అప్పుడే ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ లో కొన్ని అనుమానాలు మొదలయ్యాయి.

    గ్రాఫిక్స్ మొత్తం కార్టూన్ నెట్వర్క్ లో ఉండే కార్టూన్ బొమ్మలు లాగ ఉన్నాయి, నిజంగా ఈ సినిమాకి 500 కోట్లు ఖర్చు చేసారా అంటూ కామెంట్స్ వినిపించాయి. వచ్చిన ఆ నెగటివ్ కామెంట్స్ ని గమనించిన ప్రభాస్, ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమాని జూన్ 16 వ తేదికి వాయిదా వేయించి, గ్రాఫిక్స్ పై రీ వర్క్ చేయించాడు.

    అయితే అప్పటికే బాగా నిరాశ చెందిన ఫ్యాన్స్ ని సంతృప్తి పర్చడం కోసం ప్రభాస్ ముందుగా ఈ టీజర్ ని 3D టెక్నాలజీ కి మార్చి థియేటర్స్ లో విడుదల చెయ్యమన్నారు. 3D టీజర్ కి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అప్పటి నుండి మూవీ టీం ఈ చిత్రాన్ని కేవలం 2D లో మాత్రమే కాదు, 3D లోకి కూడా కన్వెర్ట్ చేసి విడుదల చేసింది. ఈ సినిమాకి నేడు 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయంటే అందుకు కారణం 3D ఎఫెక్ట్ అనే చెప్పాలి.

    జనాలు 3D అనుభూతిని పొందేందుకు ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూడడానికి ఎగబడ్డారు. ఆ కారణం చేతనే ఈ సినిమా ఇంత స్థాయి ఓపెనింగ్ వచ్చింది. ఇదంతా ప్రభాస్ తీసుకున్న నిర్ణయం వల్లే జరిగిందని, ఒకవేళ 3D కాకుండా కేవలం 2D లోనే ఈ చిత్రాన్ని విడుదల చేసి ఉంటే ఇప్పుడు వచ్చిన వసూళ్ళలో 50 శాతం వసూళ్లు కూడా ఉండేవి కాదని అంటున్నారు ట్రేడ్ పండితులు.