https://oktelugu.com/

Bigg Boss Amardeep: లగ్జరీ కారు కొన్న బిగ్ బాస్ అమర్ దీప్… దాని ధర ఎంతో తెలుసా?

తాజాగా అమర్ దీప్ కొత్త కారు కొనుగోలు చేశారు. కారు కొనుగోలు చేసిన ఫోటోలు, వీడియోలు అమర్ భార్య తేజస్విని తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.

Written By:
  • S Reddy
  • , Updated On : May 11, 2024 / 02:59 PM IST

    Bigg Boss Amardeep Bought A New Car

    Follow us on

    Bigg Boss Amardeep: సీరియల్ నటుడు అమర్ దీప్ బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమే. జానకి కలగనలేదు సీరియల్ తో అమర్ కి మంచి గుర్తింపు దక్కింది. ఇక బిగ్ బాస్ సీజన్ 7 లో పార్టిసిపేట్ చేయడంతో, మరింత పాపులారిటీ దక్కించుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో సత్తా చాటాడు. మొదట కాస్త తడబడినా… చివర్లో పుంజుకుని రన్నర్ గా నిలిచాడు. బిగ్ బాస్ తర్వాత అమర్ దీప్ రేంజ్ మారిపోయింది. ఆ క్రేజ్ తో సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నాడు.

    తాజాగా అమర్ దీప్ కొత్త కారు కొనుగోలు చేశారు. కారు కొనుగోలు చేసిన ఫోటోలు, వీడియోలు అమర్ భార్య తేజస్విని తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. అమర్ దీప్ – తేజస్విని బ్లాక్ కలర్ టాటా సఫారీ కారును కొనుగోలు చేశారు. తేజస్విని కొత్త కారు ముందు నిల్చొని ఫోటోలకు ఫోజులిచ్చింది. అమర్ దీప్ ఫ్రెండ్స్, సన్నిహితులు సైతం అమర్ దీప్ తో పాటు షో రూమ్ కి వెళ్లారు . కేక్ కట్ చేసిన అనంతరం అమర్, తేజు కొత్త కార్ స్టార్ చేశారు. తేజు షేర్ చేసిన ఈ రీల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

    కాగా ఈ కారు ధర రూ. 16 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు ఉంటుంది అని తెలుస్తుంది. ఇక అమర్ దీప్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. మూవీ టైటిల్ ఇంకా ఫిక్స్ కాలేదు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా దర్శకుడు రూపొందిస్తున్నాడు. అమర్ కి జంటగా సురేఖ వాణి కూతురు సుప్రీత హీరోయిన్ గా నటించడం మరో విశేషం.

    అలాగే బుల్లితెర పై అమర్ సందడి చేస్తున్నాడు. స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న నీతోనే డాన్స్ 2. 0 లో అమర్ – తేజస్వి పార్టిసిపేట్ చేస్తున్నారు. గత సీజన్ లో అమర్ – తేజస్విని గౌడ పాల్గొన్న సంగతి తెలిసిందే.ఈ జోడి గ్రాండ్ ఫినాలే వరకు చేరుకున్నారు. కానీ టైటిల్ గెలవలేకపోయారు. సీరియల్ నటి అయిన తేజస్విని గౌడను అమర్ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.