Nagarjuna: నాగార్జున ఆ ఒక్క మూవీ చేసి ఉంటే ఇండస్ట్రీ లో నెంబర్ 1 హీరో అయ్యేవాడా..?

నాగార్జున తన కెరియర్ లో చేసిన ఒకే ఒక్క మిస్టేక్ ఏంటి అంటే తమిళ్ స్టార్ డైరెక్టర్ అయిన శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమా చేసే అవకాశం వచ్చిన కూడా వదులుకున్నాడు. శంకర్ చేసిన ఒకే ఒక్కడు సినిమా కథని ముందుగా శంకర్ నాగార్జున తో చేయాలని అనుకున్నాడు.

Written By: Gopi, Updated On : January 28, 2024 9:50 am
Follow us on

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కింగ్ నాగార్జున కి ప్రత్యేకమైన స్థానం ఉందనే చెప్పాలి. ఈయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకున్నాయి. ముఖ్యంగా రొమాంటిక్ సినిమాలను చేసి నాగార్జున చాలా మంచి పేరు అయితే సంపాదించుకున్నాడు. అలాగే మాస్ యాక్షన్ సినిమాలు చేసినప్పటికీ నాగార్జున అనగానే ఎక్కువగా లవర్ బాయ్, రొమాంటిక్ క్యారెక్టర్లు మాత్రమే గుర్తుకు వస్తాయి.

అయితే నాగార్జున తన కెరియర్ లో చేసిన ఒకే ఒక్క మిస్టేక్ ఏంటి అంటే తమిళ్ స్టార్ డైరెక్టర్ అయిన శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమా చేసే అవకాశం వచ్చిన కూడా వదులుకున్నాడు. శంకర్ చేసిన ఒకే ఒక్కడు సినిమా కథని ముందుగా శంకర్ నాగార్జున తో చేయాలని అనుకున్నాడు. కానీ నాగార్జున అప్పుడు రక్షకుడు సినిమాకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉండడం వల్ల ఒకే ఒక్కడు సినిమా చేయలేక పోయాడు. దాంతో శంకర్ అర్జున్ ని పెట్టి ఆ సినిమా చేసి సూపర్ డూపర్ సక్సెస్ ని కొట్టాడు. ఇక ఈ సినిమా నాగార్జున చేసి ఉంటే ఆయన కెరియర్ మరొకలా ఉండేదని ఇప్పటికీ నాగార్జున సన్నిహితులు గాని, ఆయన అభిమానులు గాని చెప్పుకుంటూ ఉంటారు.

ఒకప్పుడు ఒకే ఒక్కడు సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఒక్కరోజు సీఎం అనే టాపిక్ వెలుగులోకి వచ్చింది ఈ సినిమాతోనే, ఇక ఈ సినిమాని చేసిన అర్జున్ కి ఆ తర్వాత ఒక 10 సంవత్సరాల పాటు హిట్ సినిమా లేకపోయిన కూడా ఆయన హీరోగా ఇండస్ట్రీ లో తన కెరీయర్ ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చాడు అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా అతనికి ఎంత పెద్ద సక్సెస్ ని కట్టబెట్టిందో, ఇక అటు తమిళ్, ఇటు తెలుగు రెండు భాషల్లోనూ తనకంటూ ఒక ప్రత్యేక మైన మార్కెట్ ను ఏర్పాటు చేసుకోవడానికి ఈ సినిమా అతనికి చాలా వరకు హెల్ప్ అయింది. ఇక అదే విధంగా నాగార్జున కనక ఈ సినిమాను చేసి ఉంటే ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ఎదిగేవాడు అంటూ చాలామంది కామెంట్స్ చేయడం విశేషం…