Kalki 2898 AD: కల్కి లో క్యామియో రోల్స్ చేసినందుకు వాళ్ళు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసా..?

కొంతమంది దర్శకులు వాళ్ళ సినిమాల్లో తప్పకుండా క్యామియో రోల్స్ ఉండేలా చూసుకుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే రీసెంట్ గా వచ్చిన కల్కి సినిమాలో కూడా కొంతమంది క్యామియో రోల్స్ పోషించారు.

Written By: Gopi, Updated On : July 6, 2024 10:11 am

Kalki 2898 AD

Follow us on

Kalki 2898 AD: ఒక సినిమాలో ఉన్న కొన్ని కీలక పాత్రలను చేయడానికి కొంతమంది ముఖ్య నటి నటులను తీసుకుంటారు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ కి వాళ్లైతేనే ప్రాణం పొస్తారని దర్శక నిర్మాతలు భావించి వాళ్ళను ఆ క్యారెక్టర్ కోసం తీసుకుంటారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపడానికి కొంతమంది చేత క్యామియో రోల్స్ చేయిస్తూ ఉంటారు. దీనివల్ల సినిమాకి బజ్ అయితే క్రియేట్ అవుతుంది.

అలాగే సినిమా చూస్తున్న ఆడియన్స్ కూడా ఒక త్రిల్ ఫీల్ అవుతూ ఉంటారు. ఇక దానివల్ల సినిమా మీద పాజిటివ్ ఒపీనియన్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకోసమే కొంతమంది దర్శకులు వాళ్ళ సినిమాల్లో తప్పకుండా క్యామియో రోల్స్ ఉండేలా చూసుకుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే రీసెంట్ గా వచ్చిన కల్కి సినిమాలో కూడా కొంతమంది క్యామియో రోల్స్ పోషించారు. ఇక అందులో రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, దుల్కర్ సల్మాన్, అనుదీప్ కె వి, విజయ్ దేవరకొండ లాంటి నటులు ఉన్నారు. మరి వీళ్ళు ఈ క్యామియో రోల్స్ చేయడం కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు. అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

ఇక ఇందులో ఉన్న క్యామియో నటులందరూ కూడా ఈ సినిమాలో నటించడానికి దాదాపు రెండు రోజుల కాల్షీట్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరి ఇలాంటి క్రమంలో వాళ్లంతా కూడా అశ్విని దత్ మీద ఉన్న గౌరవంతో ఈ సినిమాలో చేయడానికి వచ్చారు. కాబట్టి వీళ్ళకి ప్రొడ్యూసర్స్ ఎలాంటి డబ్బులను పే చేయలేదని వాళ్ళు ఫ్రీగా వచ్చి చేసినట్టుగా ప్రొడ్యూసర్స్ చెప్పడం విశేషం…

నిజానికి అశ్వినీ దత్ సీనియర్ ప్రొడ్యూసర్ కావడం తో ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులతో డైరెక్టర్స్ తో చాలా మంచి పరిచయాలు ఉన్నాయి. ఇక ఆయన పిలిస్తే చిరంజీవి లాంటి నటుడు కూడా గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వడానికి సిద్ధమవుతాడు. పెద్ద ప్రొడ్యూసర్ అయిన అశ్విని దత్ మొత్తానికైతే కల్కి లో క్యామియో రోల్స్ ఇప్పించడంలో సూపర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి…