Mohammed Shami: మహమ్మద్ షమీ.. టీమిండియాలో అద్భుతమైన బౌలర్.. పదునైన బంతులు వేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించే సామర్థ్యం ఇతడి సొంతం. ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్న ఇతడు ఇప్పుడు జట్టులో స్థానం కోసం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. తన పునరాగమనాన్ని గట్టిగా చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ.. సరైన అవకాశాలు అతనికి లభించడం లేదు..
వన్డే వరల్డ్ కప్ తర్వాత షమీ ఇంతవరకు టీమిండియా తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. గాయం కావడం వల్ల శస్త్ర చికిత్స చేయించుకోవడానికి లండన్ వెళ్లాడు. సుదీర్ఘకాలం అక్కడే ఉన్నాడు.. ఆ తర్వాత అతడు జాతీయ క్రికెట్ అకాడమీలో చేరినప్పటికీ.. తన స్థాయిలో బౌలింగ్ చేస్తున్నప్పటికీ మేనేజ్మెంట్ కరుణ చూపించడం లేదు. ఐపీఎల్ లో షమీ సత్తా చూపించలేకపోయాడు. అందువల్లే అతడికి జాతీయ జట్టులో చోటు లభించడం లేదని వార్తలు వస్తున్నాయి. మరోవైపు జాతీయ జట్టులో ఆడాలనుకునే ప్లేయర్లు కచ్చితంగా డొమెస్టిక్ క్రికెట్లో అద్భుతమైన ప్రతిభ చూపించాలని గౌతమ్ గంభీర్ ఒక నిబంధన కూడా తీసుకొచ్చాడు. దానికి తగ్గట్టుగానే షమీ కూడా డొమెస్టిక్ క్రికెట్ ఆడుతున్నాడు. అయినప్పటికీ అతనికి అవకాశం లభించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
షమీ ప్రస్తుతం డొమెస్టిక్ క్రికెట్ ఆడుతున్నాడు. ఇందులో మూడు మ్యాచ్లు ఆడిన అతడు 15 వికెట్లు సొంతం చేసుకున్నాడు. అయినప్పటికీ అతడికి దక్షిణాఫ్రికా జట్టుతో జరిగే టెస్ట్ సిరీస్లో అవకాశం లభించలేదు. ఫలితంగా అతడికి మరోసారి నిరాశ ఎదురయింది. నవంబర్ 14 నుంచి సౌత్ ఆఫ్రికా తో టీమ్ ఇండియా రెండు టెస్టుల సిరీస్ ఆడుతుంది. తొలి టెస్ట్ కోల్ కతా, రెండవ టెస్ట్ గౌహతిలో జరుగుతుంది. బీసీసీఐ ప్రకటించిన జట్టులో అతనికి అవకాశం లభించలేదు. దీంతో అతని కెరియర్ ముగిసిపోయినట్టేనా అని అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.
షమీ వ్యక్తిగత జీవితం కూడా అంత గొప్పగా లేదు. అతని భార్యతో విడాకులు తీసుకున్నాడు. పైగా అనేక రకాల ఆరోపణలు అతడిపై చేసింది. ఈ నేపథ్యంలో వ్యక్తిగత జీవితం కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతోంది. ఇన్ని సమస్యల మధ్య ఉన్న షమీ కి.. జాతీయ జట్టులో చోటు లభించకపోవడం మరింత ఇబ్బందిగా ఉంది.. అయినప్పటికీ అతడు డొమెస్టిక్ క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు.. ఏదో ఒక సందర్భంలో సెలెక్టర్లు కా
రుణ చూపించకపోతారా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు.