Homeఎంటర్టైన్మెంట్Pushpa Movie Review: అల్లు అర్జున్ "పుష్ప" సినిమా రివ్యూ... బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల లో...

Pushpa Movie Review: అల్లు అర్జున్ “పుష్ప” సినిమా రివ్యూ… బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల లో తగ్గేదే లే

Pushpa Movie Review:  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం మొదటి పార్ట్ పుష్ప ది రైజ్ నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఆర్య 1, 2 సినిమాలు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరు కలిసి తమ మూడో సినిమా చేస్తుండడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ చిత్ర బృందం రిలీజ్ చేస్తూ వచ్చిన ఒక్కో అప్డేట్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. మరి ఈ సినిమా ఎలా ఉందో మీకోసం…

Pushpa Movie Review
Pushpa Movie Review

చిత్రం: పుష్ప – ది రైజ్
నటీ నటులు: అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫాహద్ ఫాజిల్, సునీల్ , ప్రకాష్ రాజ్ , జగపతి బాబు, అనసూయ,
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నిర్మాణం: మైత్రి మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా
దర్శకత్వం: సుకుమార్
రేటింగ్ 3.5/ 5

సినిమా స్టోరీ: రాయలసీమలోని శేషాచలం కొండల్లో ఎర్ర చందనం మొక్కలను కొట్టే కూలీల సీన్ తో సినిమా మొదలవుతుంది. హీరో అల్లు అర్జున్ స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్ పాత్రలో పరిచయమవుతాడు. సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన పోలీసుల అతనిని అరెస్ట్ చేసి చితకబాది స్మగ్లింగ్ గురించి ఆరా తీస్తారు. అలా అతను తనతో స్మగ్లింగ్ చేయించింది తన బాస్ పుష్ప రాజ్ అంటూ అతని కథ చెప్పడం మొదలు పెడతాడు. కథ ఓ భారీ ట్విస్ట్ తో ముగుస్తుంది. కథ పూర్తిగా రీవిల్ అయిన అనంతరం పుష్ప రాజ్ అతి తక్కువ సమయంలో తన తెగువతో, తెలివితేటలతో స్మగ్లింగ్ సామ్రాజ్యంలో కీలకమైన వ్యక్తిగా ఎదుగుతాడు. ప్రియురాలు శ్రీవల్లి (రష్మీక మందన్నా) తో ప్రేమ వ్యవహారం నడిపిస్తూనే స్మగ్లింగ్ గ్యాంగ్ కి పుష్ప ఎలా నాయకత్వం వహిస్తాడనే దాని చుట్టే కథ మెత్తం తిరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో అతన్ని అడ్డు పెట్టుకుని కోట్లు గడించిన కొండా రెడ్డిని (అజయ్‌ ఘోష్), అతని తమ్ముళ్ళను పుష్ప ఎలా ఎదుర్కున్నాడు ? ఎర్రచందనం సిండికేట్ లీడర్ గా చక్రం తిప్పే మంగళం శ్రీను (సునీల్) తో మంచిగా ఉంటూనే అతనికే ఎలా అతన్ని ముగించేశాడు. చిన్నప్పుడే ఇంటి పేరు కోల్పోయిన పుష్ప రాజ్.. తనను ఆ కారణంతో అవమానించే వారికి ఎలా బుద్ధి చెప్పాడు ? అనేది అసలు కథ.

Also Read: అల్లు అర్జున్ “పుష్ప” సెకండ్ పార్ట్ టైటిల్ లీక్… సోషల్ మీడియాలో వైరల్

విశ్లేషణ: శేషాచలం అడవుల్లో నుంచి వేల కోట్ల విలువ చేసే ఎర్రచందనాన్ని ఎలా స్మగ్లింగ్ చేస్తారనే విషయం గురించి ఇంతకు ముందే విన్నా పూర్తి వివరాలు మాత్రం చాలామందికి తెలియదనే చెప్పాలి. ఈ చిత్రం ద్వారా డైరెక్టర్ సుకుమార్ స్మగ్లింగ్ గురించిన వివరాలను బాగా చూపించారు. రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని తీసిన ఈ చిత్రం సీక్రెట్ స్మగ్లింగ్ అంశాలను ప్రపంచానికి తెలియజేసేలా అధ్బుతంగా తెరకెక్కించారు. మాస్ అంశాలను చూపిస్తూనే… ఇటు మదర్ సెంటిమెంట్‌, అటు లవ్ సెంటిమెంట్ క్యారీ చేశారు. ముఖ్యంగా పుష్ప రాజ్ తన మనసులో ఆవేదనను తల్లితో పంచుకునే సన్నివేశంలో ఎలా గుండెల్ని పిండేశాడో, ప్రియురాలికి ప్రేమను తెలిపే సీన్ లో అంత వినోదాన్ని పండించాడు. ఇక క్లయిమాక్స్ లో ఒకటి ఎక్కువుంది అంటూ గుండెలోని కసిని వ్యక్తం చేసిన తీరూ అమోఘమనే చెప్పాలి.

ప్లస్ పాయింట్స్: అల్లు అర్జున్ యాక్టింగ్, ప్రధాన పాత్రల నటన, స్క్రీన్ ప్లే, ట్విస్ట్ లు, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, రామ్ లక్ష్మణ్, పీటర్ హెయిన్ యాక్షన్స్ సీన్స్

మైనస్ పాయింట్స్: కొన్నిచోట్ల నెమ్మదిగా నడిచే కథనం, మూవీ రన్ టైం, బలహీనమైన క్లైమాక్స్

సుక్కు ఈసారి మ్యాజిక్ చేసి బన్నీ అభిమానులకు పెద్ద పండగే ఇచ్చాడు. మూవీ చూశాక మాత్రం తగ్గేదే లే అని గట్టిగా చెప్పొచ్చు.

Also Read: అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీ ట్విట్టర్ రివ్యూ.. ఎలా ఉందంటే?

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version