iBomma Ravi Piracy Revenue :ఈమధ్య కాలం లో ఎక్కడ చూసినా ఐ బొమ్మ రవి పేరే కనిపిస్తోంది. కొత్త సినిమాలను విడుదలైన రోజే తన ఐ బొమ్మ వెబ్ సైట్ లో HD క్వాలిటీ తో అప్లోడ్ చేస్తూ సినీ నిర్మాతలకు ముచ్చమటలు పట్టించాడు. సుమారుగా ఆరేళ్ళ నుండి ఒక సెక్షన్ వర్గాన్ని థియేటర్స్ కి వెళ్లనివ్వకుండా ఇంట్లోనే కూర్చొని చూసేలా చేయడంలో రవి సక్సెస్ అయ్యాడు. సినీ ఇండస్ట్రీ పెద్దలకు రవి ఒక విలన్ లాగా కనిపించొచ్చు కానీ, మూవీ లవర్స్ కి ఆయన ఒక దేవుడు అనే చెప్పొచ్చు. 400, 500 రూపాయిల డబ్బులు పెట్టి థియేటర్స్ లో సినిమా చూడడం కంటే, HD క్వాలిటీ ప్రింట్ తో ఇంట్లోనే పైసా ఖర్చు చేయనివ్వకుండా కుటుంబం మొత్తం చూసేలా చేసే వాడిని ఎవరు మాత్రం ద్వేషిస్తారు చెప్పండి. కానీ ఇతను పైరసీ తోనే ఆగలేదు.
బెట్టింగ్ యాప్స్ ని కూడా నిర్వహించాడు, ఎంతో మంది అమాయకుల ప్రాణాలు పోవడం లో బాగస్వామ్యుడు అయ్యాడు. ఇది మాత్రం క్షమించరాని నేరం, ఇందుకు అతనికి ఏ శిక్ష వేసినా తప్పు లేదు. రీసెంట్ గానే ఇతన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించడం మొదలుపెట్టారు. ఈ విచారణ లో ఎన్నో సంచలన విషయాలు తెలిసాయి. పైరసీ మరియు బెట్టింగ్ యాప్స్ ద్వారా రవి ఇప్పటి వరకు వంద కోట్ల రూపాయిల వరకు సంపాదించాడని టాక్. పోలీసులు ఇప్పటికే రవి నుండి 30 కోట్ల రూపాయిలను స్వాధీనం చేసుకున్నారు. పైరసీ ద్వారా డబ్బులు ఎలా సంపాదించొచ్చు అంటే, ఐ బొమ్మ సైట్ లోకి వెళ్లి ఒక సినిమాని చూసేందుకు క్లిక్ చేసినప్పుడు యాడ్స్ వస్తాయి. ఆ యాడ్స్ ద్వారా డబ్బులు భారీ రేంజ్ లో వస్తుంది. సోషల్ మీడియా లో అన్ని వెబ్ సైట్స్ కి డబ్బులు వచ్చేది ఇలాగే, అలా రవి కోట్ల రూపాయిలు వెనకేసాడు. ఆయన దందా కి ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా సాగిపోయేది. కానీ అతని భార్య విడాకుల కోసం హైదరాబాద్ కి వచ్చింది. కేవలం రావడం మాత్రమే కాకుండా రవి చీకటి సామ్రాజ్యాన్ని మొత్తం కూల్చేసి వెళ్ళింది.