
రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్ఛనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం వెనుక ఒక ఐఎఎస్ అధికారి ముఖ్యపాత్ర పోషించారనే వాదనలు వినిపిస్తున్నాయి. హై కోర్టు న్యాయమూర్తుల ఫోన్ ట్యాపింగ్ పై ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైన విషయం విధితమే. ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ఈ రోజు విచారణ నిర్వహించారు. ఇది కేవలం ఒక పత్రికలో వచ్చిన కథనం మాత్రమేనని ప్రజా ప్రయోజన వ్యాజ్యం కిందకు ఇది రాదని ప్రభుత్వం తరుపు న్యాయవాదులు వాధించారు. పత్రిక యాజమాన్యాన్ని పార్టీగా చేర్చాలని కోరారు. ధర్మాసనం ఆ వాదనలతో ఏకీభవించలేదు.
Also Read: మల్టీస్టారర్ రాక పై ఫేక్ రూమర్స్ !
హై కోర్టులో ధర్మాసనం పిటీషనర్ తరుపు న్యాయవాది శ్రావణ్ కుమార్ ని ట్యాపింగ్ కు సంబంధించి ఆధారాలు సమర్పించాలని కోరింది. ఈ వ్యవహారం వెనుక ఐఎఎస్ అధికారి ఉన్నారని పిటీషనర్ తరుపు న్యాయవాది ధర్మాసనానికి విన్నవించారు. ఆ అధికారి ఎవరనేది చెప్పమని కోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేస్తామని ధర్మాసనానికి విన్నవించారు. న్యాయమూర్తులపై ప్రభుత్వం టార్గెట్ చేసిందని, గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలే ఇందుకు మూలంగా చెప్పవచ్చని తెలిపారు. సోషల్ మీడియాలో న్యాయమూర్తులకు వ్యతిరేకంగా పోస్టులు, నిమ్మగడ్డ కేసులో తీర్పు ఇచ్చినప్పడు మంత్రి, ఎంపీ చేసిన వ్యాఖ్యలు, ఇతర అంశాలను ప్రస్తావించారు. ట్యాపింగ్ వెనుక ప్రభుత్వం ఉందని వాదించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, సర్వీసు ప్రోవైడర్ కౌంటర్ అఫిడవిట్ 20వ తేదీలోగా దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. ప్రభుత్వ వాదనలపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.
Also Read: బ్రేకింగ్ : ‘ప్రభాస్’ నుండి బిగ్ అనౌన్స్ మెంట్ !
పిటీషనర్ తరుపు న్యాయవాది శ్రావణ్ కుమార్ కోర్టుకు సమర్పించే అఫిడవిట్ లో ట్యాపింగ్ వెనుక ఉన్న ఐఎఎస్ అధికారి వివరాలు, ఇతర ఆధారాలు సమర్పించాల్సి ఉంది. దీంతో ఇప్పుడు ఐఎఎస్ అధికారుల్లో ఈ వ్యవహారం కలకలం చోటు చేసుకుంది. దీని వెనుక ఉన్న ఐఎఎస్ ఎవరనే అంశం ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది. ఈ వ్యవహారం వెనుక ఎవరు ఉన్నా హై కోర్టు తీవ్రంగానే పరిగణిస్తుంది. విచారణలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ తరుపు న్యాయవాది వాదలను వినిపిస్తుండగా మీరు ఏం చేసినా మేము చూస్తూ కూర్చోవాలా అంటూ వ్యాఖ్యానించింది. మీరు విచారణ ఎందుకు జరపలేదని ప్రశ్నించింది. దీంతో న్యాయమూర్తుల ఫోన్ ట్యాపింగ్ ను హై కోర్టు తీవ్రంగానే పరిగణిస్తుందనే విషయం స్పష్టం అవుతుంది.