
హీరోయిన్లను పెళ్లి గురించి అడిగితే రకరకాల సమాధానాలు చెబుతూ తప్పించుకుంటుంటారు. ఒక్కో హీరోయిన్ ఒక్కోలా పెళ్లి విషయాన్ని దాటేయడం నిత్యం చూస్తునే ఉంటాం.. ప్రస్తుతం తాను సినిమాలనే ప్రేమిస్తున్నానని కొందరంటే.. మరికొందరేమో సరైన వ్యక్తి దొరలేడం లేదని.. లేదా పెళ్లి చేసుకోవడానికి మూడ్ లేదని కోతలు కోస్తూ ఏదో ఇండస్ట్రీని ఉద్దరిస్తున్నట్లు మాట్లాడుతుంటారు. ఇదేకోవలో తాజాగా ప్రభాస్ హీరోయిన్ పెళ్లిపై తిక్కతిక్క సమాధానం ఇస్తోంది.
ప్రభాస్ హీరోగా నటించిన ‘బుజ్జిగాడు’లో సంజన నటించింది. త్రిష మెయిన్ హీరోయిన్ కాగా సంజన సెకండ్ హీరోయిన్ గా ప్రభాస్ సరసన నటించింది. ప్రస్తుతం వెబ్ సీరీసులు, సీరియల్స్, టీవీ షోలలో నటిస్తూ బీజీగా ఉంది. తాజాగా ఈ అమ్మడికి పెళ్లిపై గాలి మళ్లిందట. లాక్డౌన్ ముగిశాక ఏ క్షణానైనా పెళ్లి చేసుకుంటానని అంటోంది. ప్రస్తుతం తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని.. అయితే తననే పెళ్లి చేసుకుంటానా? లేదా అనేది మాత్రం తెలియదని తిక్కతిక్కగా సమాధానం ఇస్తోంది. ప్రతీఒక్కరు ఎప్పుడో ఒకసారి పెళ్లి చేసుకోవాల్సిందేనని వేదాంత ధోరణి చెబుతోంది. అయితే ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నట్లు సంజన అంటోెంది. అయితే ఈ అమ్మడు వ్యవహారం చూస్తుంటే ఈ ఏడాది పెళ్లి చేసుకుంటుందా? లేదా అనేది మాత్రం అనుమానంగా కన్పిస్తుంది.