వైరల్ స్టార్ అని బహుశా ఒక్క ‘వనితా విజయ్ కుమార్’ (Vanitha Vijayakumar) కి మాత్రమే దక్కిన బిరుదు అనుకుంటా. సినిమా కథకి ఏ మాత్రం తీసిపోని కథ ఆమెది. ఆమె జీవితంలో అనేక మలుపులు, దీనికితోడు మూడు పెళ్లిళ్లు(Marriages), నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు, మధ్యలో నెటిజన్లతో గొడవలు.. మొత్తమ్మీద ‘వనితా విజయ్ కుమార్’ ఒక వివాదాల రాకుమారి.
అయితే, ఆమె గురించి సోషల్ మీడియాలో ఎంత నెగిటివ్ ఉన్నా… ఆమె మనసులో మాత్రం ఎంతో బాధ ఉంది. అందరూ ఉన్నా ఒంటరిగా మిగిలిపోయింది. సినీ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉన్నా.. అనముకురాలిగా బతుకుతుంది. లేటు వయసులో వచ్చిన ఆర్ధిక ఇబ్బందులకు తలా వంచకుండా మళ్ళీ మేకప్ వేసుకుంది ‘వనితా’.
అయితే, తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ఆమె మాటల్లోనే.. ‘తమిళ పవర్ స్టార్ ను నిజంగా పెళ్లి చేసుకుంటున్నారా ? అంటూ ఇప్పటికీ నన్ను అడుగుతూనే ఉన్నారు’ అని చెప్పి ఆమె నవ్వుతూ.. అందులో నిజం లేదు. సోషల్ మీడియాలో కొందరికి నా గురించే పని అనుకుంటా. నిత్యం నా నాలుగో పెళ్లి పైనే కామెంట్స్ చేస్తూ ఉంటారు.
అందుకే, నాకు కోపం వచ్చి, నాలుగు కాదు, 40 సార్లు పెళ్లి చేసుకుంటాను, మీకెందుకు? అని అన్నాను. అప్పుడు నేను బాగా కోపంగా రియాక్ట్ అయ్యాను. ప్రస్తుతం నాకు ముగ్గురు పిల్లలు. నా కొడుకు పేరు విజయ్ శ్రీహరి. వాడు లండన్‌లో ఫిలిం మేకింగ్ కోర్సు చేస్తున్నాడు. అలాగే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు’ అని ఆమె చెప్పుకొచ్చింది.
ఇక తెలుగులో మీరు ఎలాంటి చిత్రాలు చేయాలనుకుంటున్నారు ? అని సదరు యాంకర్ అడగడంతో వనిత మాట్లాడుతూ.. ‘నాకు తెలుగులో విభిన్న పాత్రలు చేయాలని ఆశ ఉంది. అయితే, ఫలానా పాత్రనే చేయాలి అని నేను షరతులు పెట్టుకోలేదు’ అంటూ వనిత చెప్పింది.