Star Heroine: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు వాళ్ల నటనతో అభిమానుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇక అందులో సోనాలి బింద్రే ఒకరు.. ఈమె మొదట తమిళ్ సినిమా డైరెక్టర్ అయిన మణిరత్నం తీసిన బొంబాయి సినిమాలో హమ్మ హమ్మా హమ్మా అనే సాంగ్ లో డాన్స్ చేసి ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాతో వచ్చిన సక్సెస్ ని క్యాష్ చేసుకోవడానికి తను పలు రకాల సినిమాలను కూడా చేసింది. అయితే ఈమె కృష్ణవంశీ డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా వచ్చిన మురారి సినిమాలో నటించి తెలుగు తెరకి పరిచయమైంది. అయితే ఈమె ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఇక దాంతో పాటుగా తెలుగులో చిరంజీవి, నాగార్జున, శ్రీకాంత్ లాంటి స్టార్ హీరోలందరితో నటించి మెప్పించింది.
అయితే ఈమె బొంబాయి సినిమాలో చేసిన సాంగ్ కనుక సక్సెస్ అవ్వకపోతే సినిమా ఇండస్ట్రీ నుంచి వదిలి వెళ్లిపోవాలనే నిర్ణయానికి వచ్చిందట. కానీ ఈ సాంగ్ మాత్రం సూపర్ సక్సెస్ అవడంతో సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతూ వచ్చిందట. ఈమె హీరోయిన్ గా మంచి బిజీగా ఉన్న సమయంలోనే బాలీవుడ్ నిర్మాత అయిన ‘గొల్డీ బెహ్లు’ ను పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయింది. ఇక 2005 లో ఈమెకి ఒక బాబు కూడా జన్మించాడు. ఇకాప్పటి నుంచి ఆమె సినిమాలకి దూరమైపోయింది. ఇక తను చివరిసారిగా 2013 వ సంవత్సరంలో వచ్చిన వన్ అప్ ఆన్ ఏ టైం ఇన్ ముంబై అనే సినిమాలో నటించి మెప్పించింది. ఇక ఆ తర్వాత బాలీవుడ్ లో పలు రకాల రియాల్టీ షోలకు జడ్జ్ గా వ్యవహరించింది.
ఇక 2018 లో క్యాన్సర్ బారిన పడటం అనేది ఆమెకి కోలుకోలేని దెబ్బగా మారిందని చెప్పవచ్చు. అయినప్పటికీ తను ఎక్కడ కూడా నిరాశ చెందకుండా న్యూయార్క్ లో క్యాన్సర్ కి సంబంధించిన చికిత్సను తీసుకొని క్యాన్సర్ ను జయించి మరి ప్రస్తుతం మళ్లీ సినిమా ఇండస్ట్రీకి అడుగుపెట్టబోతుంది…ఇక ఇప్పుడు ‘ది బ్రోకెన్ న్యూస్ విజన్ 2’ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల్ని అలరించడానికి రెడీ అయింది. అయితే ఈ సినిమా మే మూడవ తేదీ నుంచి ‘జీ5 ‘ లో స్ట్రీమింగ్ అవబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక దాని ప్రమోషన్ కోసమే ఆమె పలు రకాల ఇంటర్వ్యూల్లో కూడా పాల్గొటుంది. ఇక తన పర్సనల్ లైఫ్ గురించి చెబుతూ తను 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే తన కుటుంబంలో ఉన్న పేరెంట్స్ కి ఇష్టం లేకపోయిన కూడా కొన్ని ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడానికి తను సినిమాల్లో నటించాల్సి వచ్చిందని ఇక తను మొదట ఇండస్ట్రీ కి వచ్చినప్పుడు డ్యాన్స్ అంతగా రాదని దానివల్ల తను చాలా భయపడి పోయేదట…
అలాగే చాలా మంది ఆమెను తిడుతూ ఉండేవారట.ఇక తనకు కొన్ని సినిమాలు చేసిన తర్వాత బొంబాయి సినిమాలో ‘హమ్మ హమ్మ హమ్మ’ అనే సాంగ్ చేసే అవకాశం రావడం అనేది ఆమె అదృష్టంగా భావిస్తుంది. ఇక ఈ సాంగ్ కి ప్రభుదేవా మాస్టర్ కొరియోగ్రఫీ చేయగా, వాళ్ళ బ్రదర్ అయిన రాజు సుందరం మాస్టర్ లో ఈ సాంగ్ లో ఆడి పాడాల్సి వచ్చిందట. ఇక మొత్తానికి అయితే ఈ సాంగ్ ద్వారా తను భారీ పాపులరీటిని సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం తను రీఎంట్రీలో చాలా వైవిధ్యమైన పాత్రను పోషించాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి తన కోరుకున్నట్టుగానే తనకు మంచి పాత్రలు దొరుకుతాయా లేదా అని తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…