Bellamkonda Sai Sreenivas: ఆర్ధిక ఇబ్బందులతో నరకం అనుభవించాను: బెల్లంకొండ శ్రీనివాస్

మన టాలీవుడ్ మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు,ఈ నెల 12 వ తారీఖున విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని ఇటీవలే విడుదల చెయ్యగా ,దానికి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Written By: Vicky, Updated On : May 6, 2023 4:24 pm

Bellamkonda Sai Sreenivas

Follow us on

Bellamkonda Sai Sreenivas: ఇండస్ట్రీ లో బడా నిర్మాతలలో ఒకరిగా కొనసాగిన వ్యక్తి బెల్లంకొండ సురేష్. ఎన్నో అద్భుతమైన సినిమాలను ఈయన ఇండస్ట్రీ కి అందించాడు,ఆయన కుమారుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ని ఏర్పర్చుకున్నాడు. అయితే ఆయన తెలుగు వెండితెర పై కనిపించి చాలా కాలం అయ్యింది. 2021 వ సంవత్సరం లో సంక్రాంతి కానుకగా ‘అల్లుడు అదుర్స్’ అనే చిత్రాన్ని విడుదల చేసాడు,ఆ తర్వాత తన రెండేళ్ల సమయాన్ని మొత్తం ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ కోసమే కేటాయించాడు.

మన టాలీవుడ్ మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు,ఈ నెల 12 వ తారీఖున విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని ఇటీవలే విడుదల చెయ్యగా ,దానికి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ చిత్రం ప్రొమోషన్స్ కోసం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ లో పలు ఇంటర్వ్యూస్ ఇచ్చాడు,ఈ ఇంటర్వ్యూస్ లో ఆయన మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

ఆయన మాట్లాడుతూ ‘నేను పెద్ద నిర్మాత కొడుకు కాబట్టి నాకు ఇండస్ట్రీ లో హీరో గా ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ చాలా తేలికగా దొరికింది అని అందరూ అనుకున్నారు, నా మొదటి సినిమా ‘అల్లుడు శ్రీను’ లో సమంత హీరోయిన్ మరియు తమన్నా ఐటెం సాంగ్ అని చెప్పగానే వాళ్ళు ప్రారంభం లో ఒప్పుకోలేదు. ఆ తర్వాత నేను నటించిన కొన్ని డ్యాన్స్/యాక్టింగ్ వీడియోలు డెమో పంపిన తర్వాత, అది చూసి నచ్చబట్టే ఆ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారు,ఎంతో కస్టపడి ఆ సినిమా చేశాను, కమర్షియల్ గా పెద్ద అయ్యింది. కానీ ఆ సమయం లో ఆర్థిక సమస్యలతో మా కుటుంబం మునిగిపోయింది.మా నాన్న గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించిన సినిమా డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత ఆయన డిస్ట్రిబ్యూటర్ గా చేసిన 8 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అందువల్ల కుటుంబం మొత్తం రిస్క్ లో పడింది.అది చూసి నేను కూడా మానసికంగా ఎంతో కృంగిపోయాను,అల్లుడు శ్రీను హిట్టైన తర్వాత నాకు ఎన్నో అవకాశాలు వచ్చాయి, కానీ నా మూడ్ బాగలేకపోవడం తో అన్నీ వదులుకున్నాను..ఆ తర్వాత కొన్నాళ్ళకు ‘జయ జానకి నాయక’ సినిమా చేశాను, ఈ చిత్రం నన్ను అన్నీ విధాలుగా నిలదొక్కుకునేలా చేసింది’ అంటూ చెప్పుకొచ్చాడు.