పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణూ దేశాయ్ ప్రస్తుతం ఓ సినిమాను తెరకెక్కించే పనిలో ఉంది. ఆ మధ్య లోకేషన్స్ కోసం వికారాబాద్ అడవుల్లోకి వెళ్ళి కొన్ని గిరిజన తెగలను అణువణువు గాలించి.. త్వరలో తీయబోయే తన సినిమా కోసం కొన్ని లోకేషన్స్ ను పట్టుకుంది. నిజానికి రేణూ దేశాయ్ కేవలం ఈ ప్రాజెక్ట్ కోసమే హైదరాబాద్ కు మకాం మార్చింది. ఆల్ రెడీ మరాఠీలో ఒక సినిమా తీస్తే.. అక్కడ ఆ సినిమా పెద్దగా ఆడలేదు. అదే […]
పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణూ దేశాయ్ ప్రస్తుతం ఓ సినిమాను తెరకెక్కించే పనిలో ఉంది. ఆ మధ్య లోకేషన్స్ కోసం వికారాబాద్ అడవుల్లోకి వెళ్ళి కొన్ని గిరిజన తెగలను అణువణువు గాలించి.. త్వరలో తీయబోయే తన సినిమా కోసం కొన్ని లోకేషన్స్ ను పట్టుకుంది. నిజానికి రేణూ దేశాయ్ కేవలం ఈ ప్రాజెక్ట్ కోసమే హైదరాబాద్ కు మకాం మార్చింది. ఆల్ రెడీ మరాఠీలో ఒక సినిమా తీస్తే.. అక్కడ ఆ సినిమా పెద్దగా ఆడలేదు. అదే తెలుగు సినిమా చేస్తే.. ఎంత లేదు అన్నా సినిమాకి ఫ్రీగా ఫుల్ పబ్లిసిటీ దొరుకుతుంది. అందకే అర్జెంట్ గా తెలుగు సినిమా చేయడానికి రేణు సన్నాహాలు చేసుకుంటుంది.
అయితే రేణూ దేశాయ్ తెరకెక్కించబోయే ఈ సినిమా కథ రైతు కథాంశంతో సాగుతుందట. అందుకే రైతుల స్థితిగతులు, జీవన విధానం పరిశోధించి మరీ రేణూ దేశాయ్ ఎన్నో విషయాలను రిసెర్చ్ చేసింది. అందుకే ఈ సినిమా కోసం పాటను కూడా జానపద కళాకారుడి చేత రాయించాలనుకుంది. ఈ క్రమంలోనే రేణూ దేశాయ్ జానపద కళాకారుడు, గేయ రచయిత గోరేటి వెంకన్నను కలిసి.. తన సినిమాలో రైతులు గురించి ఓ పాట పాడమని అడిగేందుకు వారి ఇంటికి వెళ్లింది. అక్కడ గోరెటి వెంకన్న శ్రీమతి చూపించిన ప్రేమ రేణూ దేశాయ్ ను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా గోరెటి వెంకన్న ఇంటిలో వడ్డించిన వంటలు, వాళ్ళు చూపించిన ఆప్యాయత ప్రేమ రేణూ దేశాయ్ ను బాగా కదిలించిందట.
కాగా ఈ విషయం గురించి రేణూ దేశాయ్ కొన్ని ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ.. ‘నన్ను ఎంతో గొప్పగా ఆదరించారు. నా పై ఎంతో ప్రేమను చూపించారు. నేను పాటల సెషన్ కోసం గోరెటి వెంకన్న గారింటికి వెళ్తే.. నాకు మంచి అనుభూతి దొరికింది. నా సినిమాలోని రైతుల కోసం గోరెటి వెంకన్నగారు పాట రాయడం నేను గౌరవంగా భావిస్తున్నా. ఇక గోరెటి వెంకన్నగారి శ్రీమతి మా కోసం మట్టి పాత్రల్లో వండిన అన్నం, పప్పు అలాగే రుచికరమైన రోటీ పచ్చడి చాల బాగున్నాయి. పూలు, బొకేను గిఫ్ట్‌గా ఇచ్చే బదులు ఓ అరిటాకులో మాకు భోజనం వడ్డించి గొప్ప ప్రేమను పంచారు. వారిది ఎంతో సాధారణమైన జీవితం, చిన్న వ్యవసాయ క్షేత్రమే కావొచ్చు. కానీ వారి హృదయం చాలా విశాలమైనది. ఆదివారం మధ్యాహ్నాం వారితో గడిపి ఎంతో అనుభూతి చెందాను’ అని రేణూ దేశాయ్ ఎమోషనల్ గా పోస్ట్ పెట్టింది.