ఎవ్వరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా టాలీవుడ్ ఒక గొప్ప హీరోను కోల్పోయిందా? జూనియర్ ఎన్టీఆర్ తోపాటు లాంచ్ అయితే నారా లోకేష్ బాబు ఇప్పుడు ఎక్కడికో వెళ్లిపోయేవాడా? అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చి ఫ్లాప్ అయ్యాడా? తనకు సూటు కానీ రాజకీయంలో కంటే నాడు సినిమాల్లోకి వెళితే ఇప్పుడు ఇండస్ట్రీని దున్నేసేవాడా? అంటే ఔననే అంటున్నాయి పాత జ్ఞాపకాలు.. లోకేష్ బాబు హీరో అవ్వడం తృటిలో మిస్ అయ్యిందన్న వార్త తెలిసి ఇప్పుడు వైరల్ అయ్యింది.
Also Read : వారితో గడిపి ఎంతో అనుభూతి చెందాను – రేణూ దేశాయ్
డాక్టర్ కావాల్సింది.. యాక్టర్ అయ్యానని చాలా మంది చెబుతుంటారు. కానీ మన టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు , ప్రస్తుత ఎమ్మెల్సీ నారా లోకేష్ కూడా యాక్టర్ కాబోయి పొలిటీషియన్ అయ్యాడా? అంటే ఔననే అంటున్నాయి పాత సంఘటనలు..
నాడు జూనియర్ ఎన్టీఆర్ 2001లో ‘స్టూడెంట్ నంబర్ 1’ చిత్రంతో సినిమాల్లో అడుగుపెట్టాడు. అది జరిగిన ఏడాదికి లోకేష్ కూడా సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకున్నాడట.. అప్పుడు సీఎం చంద్రబాబే కావడంతో ఈ మేరకు చురుకుగా ప్రయత్నాలు జరిగాయని ఓ టాక్ సినీ ఇండస్ట్రీలో ఉంది.
నాడు ‘జయం’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చి ఫుల్ ఫామ్ లో ఉన్న తేజ దర్శకత్వంలో నారా లోకేష్ హీరోగా ఓ సినిమా కూడా ప్లాన్ చేశారని.. అది పట్టాలు ఎక్కలేదని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ కు పోటీగా నారా వారసుడు సినిమా హీరో అవుదామని కలలు గన్నాడట.. కానీ ప్చ్.. అది నెరవేరలేదు. దీంతో చంద్రబాబు వారసుడిగా పొలిటీషియన్ అయిపోయాడు.
ఇప్పుడు ఈ విషయం ఎందుకు బయటపడిందంటే.. 2002 నాటి ‘సంతోషం’ సినీ వారపత్రికను తాజాగా దాని అధినేత , సినీ నిర్మాత సురేష్ కొండేటి పంచుకున్నారు. ఆ తొలి సంచిక కవర్ పేజీ మీద ‘ముఖ్యమంత్రి తనయుడు హీరోగా ‘తేజ’ చిత్రం’ అనే శీర్షికతో ఆ ఫొటోలను ప్రచురించారు. ఈ ఫొటోలను సురేష్ కొండేటి ట్వీట్ చేయడంతో విషయం వైరల్ అయయింది.
Also Read : బాబుకు వయసు బెంగ పట్టుకుందట..?
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే టాక్ నడుస్తోంది. అబ్బా మన చినబాబు నిజంగా యాక్టర్ అయ్యింటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ లా ఇండస్ట్రీని ఏలేవాడని.. దున్నేసేవాడని తెలుగు తమ్ముళ్లు చెవులు కొరుక్కుంటున్నారు. రాజకీయాల్లోకి వచ్చి ఫ్లాప్ అయ్యాడని అనుకుంటున్నారట.. వైసీపీ శ్రేణులు మాత్రం ఈ ఫొటోను తీసుకొని తెగ వైరల్ చేస్తూ లోకేష్ హీరో అంటూ ‘ట్రోల్ ’ చేస్తున్నారు.