Sai Dharam Tej- Virupaksha: 2021 సెప్టెంబర్ నెలలో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. బైక్ అదుపుతప్పి క్రింద పడిపోవడంతో సాయి ధరమ్ కి గాయాలయ్యాయి. నెలల పాటు సాయి ధరమ్ మీడియాకు కనిపించలేదు. రిపబ్లిక్ మూవీ విడుదలకు ముందు ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రమాదం తర్వాత సాయి ధరమ్ తేజ్ నుండి వస్తున్న ఫస్ట్ మూవీ విరూపాక్ష. ఈ చిత్ర టీజర్ అండ్ టైటిల్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. విరూపాక్ష ఫస్ట్ గ్లిమ్ప్స్ విడుదల ఈవెంట్లో సాయి ధరమ్ కొంచెం ఎమోషనల్ అయ్యారు.

అమ్మా నన్ను క్షమించు అండ్ ఐ లవ్ యు. నేను ఆసుపత్రి బెడ్ పై ఉన్నప్పుడు ఈ మాటలు చెప్పాలి అనుకున్నాను. అప్పుడు చెప్పలేకపోయాను. ఇక నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణమైన, నాకు ఓర్పు సహనం నేర్పిన ముగ్గురు మామయ్యలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. వారి ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. తారక్ ని నేను 2007లో మొదటిసారి కలిశాను. అప్పుడు ఎంతగా ప్రేమగా పలకరించాడో ఇప్పుడు కూడా అంటే ప్రేమను చూపిస్తున్నారు. ఆయన చేసిన సహాయాన్ని నేనెప్పుడూ రుణపడి ఉంటాను, అని సాయి ధరమ్ తేజ్ వేదికపై ఎమోషనల్ అయ్యారు.
నేడు విడుదలైన విరూపాక్ష ఫస్ట్ గ్లిమ్ప్స్ ఆకట్టుకుంది. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్, విజువల్స్ ఆసక్తి పెంచేశాయి. విరూపాక్ష చిత్రంపై మొత్తంగా ప్రోమో అంచనాలు పెంచేసింది. అనంతరం చిత్రం గురించి హీరో వైష్ణవ్ తేజ్, దర్శకుడు కార్తీక్ ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. ఫస్ట్ గ్లిమ్ప్స్ చూశాక ఇది మూఢ నమ్మకాలపై తెరకెక్కిన చిత్రంగా ప్రచారం అవుతుంది. ఈ ప్రచారానికి క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రానికి ఆధారం అదే అని సాయి ధరమ్ తెలిపారు. అలాగే తాను ఆంజనేయస్వామి భక్తుడు అని వెల్లడించారు.

సాయి ధరమ్ తేజ్ 2018లోనే కార్తీక్ నుండి ఈ కథ విన్నాడట. ఇతర చిత్రాలు, కరోనా పరిస్థితులు, ప్రమాదం వంటి కారణాల వలన ఆలస్యమైందన్నారు. ఇక కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకుడు కార్తీక్ తెరకెక్కిస్తున్నాడట. పేపర్లో ఈ తరహా సంఘటనలు అనేకం చదివాను. ఒక సంఘటన నన్ను ఆకర్షించింది. దాని ఆధారంగా విరూపాక్ష కథ రాసుకున్నాను అన్నారు. విరూపాక్ష యూనివర్సల్ సబ్జెక్టు అందుకే పాన్ ఇండియా మూవీగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు సాయి ధరమ్ తేజ్ వెల్లడించారు.
బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. 2023 సమ్మర్ కానుకగా ఏప్రిల్ 21న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా బైక్ ప్రమాదం గురించి కూడా సాయి ధరమ్ మాట్లాడారు. ప్రమాదం చిన్నదే అయినప్పటికీ… మానసికంగా బయటకు రావడానికి ఆరు నెలల సమయం పట్టింది అన్నారు.