Rajamouli Remuneration: సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలోనే దర్శక ధీరుడు రాజమౌళి తో ఒక సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే..#RRR వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత తెరకెక్కబోతున్న ఈ సినిమా గురించి అభిమానులతో పాటుగా ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..ఈ చిత్రం ఫారెస్ట్ అడ్వెంచర్ నేపథ్యం లో సాగనుంది..హీరో ప్రపంచం మొత్తం తిరుగుతూ సాహసాలు చేసేవాడిగా ఈ చిత్రం లో కనిపించబోతున్నారట..ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది.

ఇది పూర్తి అవ్వడానికి మరో ఆరు నెలల సమయం పట్టవచ్చు..ఈలోపు మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చెయ్యడానికి పూనుకున్నాడు..వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ నెలాఖరున..లేదా జనవరి నెల నుండి ప్రారంభం అవ్వబోతుందని తెలుస్తుంది..ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆయన రాజమౌళి తెరకెక్కించబోయ్యే సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు..ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించి రాజమౌళి మరియు మహేష్ బాబు తీసుకుంటున్న పారితోషికాల గురించి సోషల్ మీడియా లో ఒక వార్త తెగ ప్రచారం అవుతుంది.
అదేమిటి అంటే ఈ సినిమాలో నటిస్తున్నందుకు గాను మహేష్ బాబు కి నిర్మాత కె ఎస్ రామారావు వంద కోట్ల రూపాయిల పారితోషికం ఇస్తున్నట్టు సమాచారం..ఇది భారీ మొత్తమే అయ్యినప్పటికీ మహేష్ బాబు కంటే రాజమౌళి ఎక్కువ పారితోషికం అందుకోబోతున్నట్టు తెలుస్తుంది..ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ లో ఆయన వచ్చిన లాభాల్లో షేర్ తీసుకోబోతున్నాడట..సినిమా విడుదలయ్యాక వచ్చిన లాభాల్లో 30 శాతం వరుకు రాజమౌళి కి రెమ్యూనరేషన్ రూపం లో వెళ్లబోతుందని తెలుస్తుంది..అంటే ఒకవేళ సినిమా 2000 కోట్ల రూపాయిలు వసూలు చేస్తే రాజమౌళి రెమ్యూనరేషన్ 200 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని సమాచారం.

ఆ విధంగా రాజమౌళి మహేష్ కంటే ఎక్కువ పారితోషికం తీసుకోబోతున్నాడని సోషల్ మీడియా లో ఒక ప్రచారం జరుగుతుంది..నిర్మాత కూడా రాజమౌళి అడిగిన ఏ డిమాండ్ ని కూడా కాదు అనకుండా ఆయనకీ అన్నీ విధాలుగా సహకరిస్తున్నాడు..#RRR తో పాన్ వరల్డ్ మార్కెట్ ని ఓపెన్ చేసిన రాజమౌళి..ఈ సినిమా తో ఇంకెన్ని అద్భుతాలు సృష్టించబోతున్నాడో చూడాలి.