Manchu Lakshmi: మోహన్ బాబు ముద్దుల కూతురు మంచు లక్ష్మి సోషల్ మీడియా పోస్ట్ పలు అనుమానాలకు దారి తీసింది. ఆమె చేయకూడని తప్పులు చేశానని చెప్పడం సంచలనం రేపుతోంది. మోహన్ బాబు వారసుల్లో మంచు లక్ష్మి ఒకరు. ఆయనకు లక్ష్మి ఒక్కగానొక్క కూతురు. ఆమె పేరున లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ ఏర్పాటు చేసి పలు హిట్ చిత్రాలు నిర్మించారు మోహన్ బాబు. తమ కుటుంబానికి అదృష్ట దేవతగా మంచు లక్ష్మిని ఆయన భావిస్తారు. అయితే మంచు లక్ష్మి వ్యక్తిగత జీవితంలో కొన్ని తెలియని కోణాలు ఉన్నాయి.

మంచు లక్ష్మి భర్త పేరు ఆండీ శ్రీనివాసన్. 2006లో వీరి వివాహం జరిగింది. ఆయన ఎక్కువగా అమెరికాలోనే ఉంటారని సమాచారం. వివాహం జరిగిందే కానీ కలిసి ఉన్నట్లు కనిపించరు. చాలా అరుదుగా మంచు లక్ష్మి-శ్రీనివాసన్ ఫోటోలు బయటకు వస్తాయి. అలాగే మంచు లక్ష్మి సరోగసి పద్దతిలో తల్లి అయ్యారు. లక్ష్మి కూతురికి ఒక పదేళ్ల వయసు ఉంటుంది. తల్లి దగ్గరే ఆమె పెరుగుతున్నారు.
మంచు లక్ష్మి హైదరాబాద్ లో తండ్రి మోహన్ బాబుతో ఉంటారు. కొన్నాళ్ళు మంచు లక్ష్మి అమెరికాలో ఉన్నారు. ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడగల మంచు లక్ష్మి అమెరికన్ టెలివిజన్ షోస్ హోస్ట్ చేశారు. రెండు మూడు ఇంగ్లీష్ చిత్రాల్లో నటించారు. అనంతరం ఇండియా వచ్చి హీరోయిన్ గా ప్రయత్నాలు చేశారు. అయితే కనీసం మంచి నటిగా పరిశ్రమలో మంచు లక్ష్మి నిలదొక్కుకోలేక పోయారు. నిర్మాతగా, నటిగా సినిమాలు చేస్తున్నా గుర్తింపు మాత్రం రావడం లేదు.

ఈ క్రమంలో జీవితంలో కొన్ని చేయకూడని తప్పులు చేశానని మంచు లక్ష్మి చెప్పడం సంచలనంగా మారింది. ”గతంలో నేను సరిదిద్దుకోలేని తప్పులు చేశాను. ఇకపై నేను ఆ తప్పులు చేయను” అని సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. దీంతో అసలు ఏ తప్పుల గురించి ఆమె మాట్లాడుతున్నారనేది ఆసక్తికరంగా మారింది. మంచు లక్ష్మి చేసిన తప్పులు వృత్తి పరమైనవా? లేక వ్యక్తిగతమా? అనే సందేహాలు మొదలయ్యాయి. కాగా మోహన్ బాబు ఇద్దరు కుమారులు కూడా కెరీర్లో ఫెయిల్ అయ్యారు. మనోజ్ అయితే వ్యక్తిగత సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు. విభేదాలతో అతడు కుటుంబానికి దూరంగా ఉంటున్నాడని వార్తలు వస్తున్నాయి.