Homeఎంటర్టైన్మెంట్Adivi Sesh: ఆ హీరోకి ఉన్న అఫైర్లు నాకు లేవు - అడవి శేష్

Adivi Sesh: ఆ హీరోకి ఉన్న అఫైర్లు నాకు లేవు – అడవి శేష్

Adivi Sesh: విబిన్నమైన కథాంశాలతో టాలీవుడ్ లో ఒక్కో మెట్టు ఎక్కుతూ నేడు పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు పొందిన నటుడు అడవి శేష్..కెరీర్ ప్రారంభం లో ఈయన చిన్న చిన్న పాత్రలు మరియు నెగటివ్ రోల్స్ చేస్తూ ఆ తర్వాత హీరో రేంజ్ కి ఎదిగిన సంగతి మన అందరికి తెలిసిందే..ఇటీవలే ఈయన హీరో గా నటించిన మేజర్ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..19 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా ఫుల్ రన్ లో 30 కోట్ల రూపాయిల షేర్ ని సాధించింది..ముంబాయి తాజ్ హోటల్ దాడుల్లో వీరోచితంగా పోరాడి తన ప్రాణాలను వదులుకున్న మేజర్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ని ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన ఈ చిత్రం అన్ని ప్రాంతీయ బాషలలో ఇటీవలే ఘనంగా విడుదల అయ్యి విమర్శకుల ప్రశంసలే కాకుండా కమర్షియల్ గా కూడా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది..ఈ సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మించిన సంగతి మన అందరికి తెలిసిందే..మేజర్ ఉన్ని కృష్ణన్ గా అడవి శేష్ నటన ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టించేలా చేసింది..నటుడిగా ఈ సినిమా ఆయన స్థాయి ని నేషనల్ లెవెల్ లో ఎక్కడికో తీసుకెళ్లింది అని చెప్పొచ్చు.

Adivi Sesh
Adivi Sesh

Also Read: Mahesh- Nani Movies: ఫ్లాప్ టాక్ తో హిట్… హిట్ టాక్ తో ఫ్లాప్ , మహేష్-నాని చిత్రాల సమీకరణాలు ఎందుకు మారాయంటే!

ఈ సినిమా భారీ విజయం సాధించిన తర్వాత అడవి శేష్ పలు ఇంటర్వూస్ లో పాల్గొన్నాడు..ఈ ఇటీవలే ఆయన పాల్గొన్న ఒక్క ఇంటర్వ్యూ లో తన కెరీర్ గురించి మాత్రమే కాకుండా..తన వ్యక్తిగత జీవితం గురించి కూడా ఆయన మాట్లాడిన కొన్ని మాటలు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..’మహేష్ సార్ నాతో సినిమా చేస్తున్నాను అని చెప్పినప్పుడే ఒక కల లా అనిపించింది..అంత పెద్ద సూపర్ స్టార్ తన బ్యానర్ లో నన్ను పెట్టి సినిమా తియ్యడం ఒక్క విశేషం అయితే..ఉన్ని కృష్ణన్ లాంటి గొప్ప వ్యక్తి పాత్రని నేను పోషించడం నా జీవితం లో అదృష్టం గా భావించే విషయం’ అంటూ చెప్పుకొచ్చాడు..ఈ సినిమా చేసిన తర్వాత ఉన్ని కృష్ణన్ గారికి పెద్ద ఫ్యాన్ గా మారిపోయాను అంటూ అడవి శేష్ ఈ ఇంటర్వ్యూ లో మాట్లాడాడు..ఇక అడవి శేష్ పెళ్లి గురించి యాంకర్ ప్రస్తావించగా దానికి సమాధానం చెప్తూ ‘ఇండస్ట్రీ లో నాకంటే పెద్దవాళ్ళు ఇంకా పెళ్లి చేసుకోలేదు..ప్రభాస్ ,సల్మాన్ ఖాన్ వంటి వారు కూడా ఇంకా బ్యాచిలర్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు..నాకు ఏమి వయసు అయిపోలేదు కదా..నేను వాళ్ళు చేసుకున్న తర్వాతే పెళ్లి చేసుకుంటాను’ అంటూ చెప్పుకొచ్చాడు..అప్పుడు యాంకర్ మాట్లాడుతూ ‘సల్మాన్ ఖాన్ కి లాగానే మీకు కూడా అఫైర్స్ ఉన్నాయా’ అని అడిగిన ప్రశ్నకి అడవి శేష్ సమాధానం చెప్తూ ‘నాకు సల్మాన్ ఖాన్ లాగ అఫైర్స్ లేవు కానీ, అమెరికా లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి ని చాలా ప్రేమించాను..ఈమధ్యనే ఆ అమ్మాయికి పెళ్లయింది అని తెలిసి మానసికంగా చాలా బాధ పడ్డాను’ అంటూ చెప్పుకొచ్చాడు అడవి శేష్.

Adivi Sesh
Salman khan

Also Read: Y S Sharmila: షర్మిల పాలేరులో గెలుస్తుందా? ప్రత్యర్థులెవరు? సేఫ్ నియోజకవర్గమేనా?

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Oktelugu Epaper
Exit mobile version