https://oktelugu.com/

Adivi Sesh: ఆ హీరోకి ఉన్న అఫైర్లు నాకు లేవు – అడవి శేష్

Adivi Sesh: విబిన్నమైన కథాంశాలతో టాలీవుడ్ లో ఒక్కో మెట్టు ఎక్కుతూ నేడు పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు పొందిన నటుడు అడవి శేష్..కెరీర్ ప్రారంభం లో ఈయన చిన్న చిన్న పాత్రలు మరియు నెగటివ్ రోల్స్ చేస్తూ ఆ తర్వాత హీరో రేంజ్ కి ఎదిగిన సంగతి మన అందరికి తెలిసిందే..ఇటీవలే ఈయన హీరో గా నటించిన మేజర్ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..19 కోట్ల రూపాయిల […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 20, 2022 3:16 pm
    Follow us on

    Adivi Sesh: విబిన్నమైన కథాంశాలతో టాలీవుడ్ లో ఒక్కో మెట్టు ఎక్కుతూ నేడు పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు పొందిన నటుడు అడవి శేష్..కెరీర్ ప్రారంభం లో ఈయన చిన్న చిన్న పాత్రలు మరియు నెగటివ్ రోల్స్ చేస్తూ ఆ తర్వాత హీరో రేంజ్ కి ఎదిగిన సంగతి మన అందరికి తెలిసిందే..ఇటీవలే ఈయన హీరో గా నటించిన మేజర్ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..19 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా ఫుల్ రన్ లో 30 కోట్ల రూపాయిల షేర్ ని సాధించింది..ముంబాయి తాజ్ హోటల్ దాడుల్లో వీరోచితంగా పోరాడి తన ప్రాణాలను వదులుకున్న మేజర్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ని ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన ఈ చిత్రం అన్ని ప్రాంతీయ బాషలలో ఇటీవలే ఘనంగా విడుదల అయ్యి విమర్శకుల ప్రశంసలే కాకుండా కమర్షియల్ గా కూడా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది..ఈ సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మించిన సంగతి మన అందరికి తెలిసిందే..మేజర్ ఉన్ని కృష్ణన్ గా అడవి శేష్ నటన ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టించేలా చేసింది..నటుడిగా ఈ సినిమా ఆయన స్థాయి ని నేషనల్ లెవెల్ లో ఎక్కడికో తీసుకెళ్లింది అని చెప్పొచ్చు.

    Adivi Sesh

    Also Read: Mahesh- Nani Movies: ఫ్లాప్ టాక్ తో హిట్… హిట్ టాక్ తో ఫ్లాప్ , మహేష్-నాని చిత్రాల సమీకరణాలు ఎందుకు మారాయంటే!

    ఈ సినిమా భారీ విజయం సాధించిన తర్వాత అడవి శేష్ పలు ఇంటర్వూస్ లో పాల్గొన్నాడు..ఈ ఇటీవలే ఆయన పాల్గొన్న ఒక్క ఇంటర్వ్యూ లో తన కెరీర్ గురించి మాత్రమే కాకుండా..తన వ్యక్తిగత జీవితం గురించి కూడా ఆయన మాట్లాడిన కొన్ని మాటలు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..’మహేష్ సార్ నాతో సినిమా చేస్తున్నాను అని చెప్పినప్పుడే ఒక కల లా అనిపించింది..అంత పెద్ద సూపర్ స్టార్ తన బ్యానర్ లో నన్ను పెట్టి సినిమా తియ్యడం ఒక్క విశేషం అయితే..ఉన్ని కృష్ణన్ లాంటి గొప్ప వ్యక్తి పాత్రని నేను పోషించడం నా జీవితం లో అదృష్టం గా భావించే విషయం’ అంటూ చెప్పుకొచ్చాడు..ఈ సినిమా చేసిన తర్వాత ఉన్ని కృష్ణన్ గారికి పెద్ద ఫ్యాన్ గా మారిపోయాను అంటూ అడవి శేష్ ఈ ఇంటర్వ్యూ లో మాట్లాడాడు..ఇక అడవి శేష్ పెళ్లి గురించి యాంకర్ ప్రస్తావించగా దానికి సమాధానం చెప్తూ ‘ఇండస్ట్రీ లో నాకంటే పెద్దవాళ్ళు ఇంకా పెళ్లి చేసుకోలేదు..ప్రభాస్ ,సల్మాన్ ఖాన్ వంటి వారు కూడా ఇంకా బ్యాచిలర్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు..నాకు ఏమి వయసు అయిపోలేదు కదా..నేను వాళ్ళు చేసుకున్న తర్వాతే పెళ్లి చేసుకుంటాను’ అంటూ చెప్పుకొచ్చాడు..అప్పుడు యాంకర్ మాట్లాడుతూ ‘సల్మాన్ ఖాన్ కి లాగానే మీకు కూడా అఫైర్స్ ఉన్నాయా’ అని అడిగిన ప్రశ్నకి అడవి శేష్ సమాధానం చెప్తూ ‘నాకు సల్మాన్ ఖాన్ లాగ అఫైర్స్ లేవు కానీ, అమెరికా లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి ని చాలా ప్రేమించాను..ఈమధ్యనే ఆ అమ్మాయికి పెళ్లయింది అని తెలిసి మానసికంగా చాలా బాధ పడ్డాను’ అంటూ చెప్పుకొచ్చాడు అడవి శేష్.

    Salman khan

    Also Read: Y S Sharmila: షర్మిల పాలేరులో గెలుస్తుందా? ప్రత్యర్థులెవరు? సేఫ్ నియోజకవర్గమేనా?

    Tags