Samantha : నేటి తరం హీరోయిన్స్ లో సమంత(Samantha Ruth Prabhu) తన జీవితం లో ఎదురుకున్నని ఆటుపోట్లు, ఏ హీరోయిన్ కూడా ఎదురుకోలేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మానసికంగా, శారీరకంగా ఆమె దేవుడు పెట్టిన ఎన్నో కఠినమైన పరీక్షలను ఎదురుకొని నిలబడి, ఆమె స్థానం లో ఉండే ఆడవాళ్లకు ఆదర్శంగా నిల్చింది. ఒక పక్క ప్రేమించిన వ్యక్తితో విడాకులు తీసుకున్న ఘటన కారణంగా మానసికంగా కృంగిపోయిన సమంతకు, అదనంగా మయోసిటిస్ వ్యాధి కూడా సోకింది. అసలు బ్రతుకుంటుందా లేదా అనే భయంతో ఆమె అభిమానులు ఎంత టెన్షన్ పడ్డారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎట్టకేలకు ఆ ప్రాణాంతక వ్యాధి నుండి కోలుకొని ఇప్పుడిప్పుడే ఆమె మళ్ళీ సినిమా షూటింగ్స్ తో బిజీ అవుతుంది. అయితే రీసెంట్ గా ఆమె తన ఇంస్టాగ్రామ్ లో పెట్టిన ఒక పోస్ట్ బాగా వైరల్ అయ్యింది. ఆధ్యాత్మికత గురించి ఆమె మాట్లాడిన మాటలు అందరినీ ఆలోచింపచేసింది.
ఆమె మాట్లాడుతూ ‘జీవితం లో నేను ఎంతో ఒత్తిడికి గురైనప్పుడు, ఏమి చేయాలో తోచని పరిస్థితి వచ్చినప్పుడు నేను ఆధ్యాత్మిక మార్గం లో నడిచే ప్రయత్నం చేశాను. ఒకానొక సమయంలో మూడు రోజుల పాటు నా బుర్రలో లేని పోనీ ఆలోచనలు వచ్చాయి. నరకం అనుభవించాను. అలాంటి సమయంలో నేను తమిళనాడు లోని కోయంబత్తూరులో ఉన్నటువంటి ఇషా ఫౌండేషన్ లో ధ్యానం, యోగ సాధనం అలవాటు చేసుకున్నాను. సద్గురు వద్ద ఎన్నో సాధనాలు నేర్చుకున్నాను. అవి నా జీవితానికి ఎంతో ఉపయోగపడ్డాయి. అప్పటి నుండి నేను నాకు ఎప్పుడు ఒత్తిడి అనిపించినా అక్కడికి వెళ్తాను, ధ్యానం చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇప్పుడు ఆమె అక్కడే ఉందట. దానికి సంబంధించిన ఫోటో ఒకటి తన ఇంస్టాగ్రామ్ లో స్టోరీలో అప్లోడ్ చేసింది. ‘మూడు రోజులపాటు ఫోన్ లేదు, కమ్యూనికేషన్ లేదు. కేవలం నాకు నేను మాత్రమే తోడు’ అంటూ చెప్పుకొచ్చింది.
ఎదో ఒక కారణంతో ఒంటరిగా ఉండడం అత్యంత భయానకమైన విషయం, కానీ నేను మాత్రం ఫోన్ లేకుండా ఒంటరిగా ఉండగలను, నన్ను మిలియన్ సార్లు అడిగినా ఇదే చెప్తాను అంటూ ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇకపోతే సమంత ‘ఖుషి’ చిత్రం తర్వాత మళ్ళీ వెండితెర పై కనిపించలేదు అనే సంగతి మన అందరికీ తెలిసిందే. ఆమెని అభిమానులు బాగా మిస్ అవుతున్నారు. గత ఏడాది ఆమె ‘సిటాడెల్'(Citadel) అనే వెబ్ సిరీస్ తో అమెజాన్ ప్రైమ్ ద్వారా మన ముందుకొచ్చింది కానీ, అ సిరీస్ కి అనుకున్న స్థాయిలో మాత్రం రెస్పాన్స్ రాలేదు. ప్రస్తుతం ఆమె ‘రక్త బ్రహ్మాండ’ అనే నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ లో నటిస్తుంది. ఈ వెబ్ సిరీస్ తో పాటు ఆమె ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాలో కూడా నటిస్తుంది. ఈ చిత్రానికి ఆమె నిర్మాతగా కూడా వ్యవహరించడం గమనార్హం.