Also Read: నాని ‘వి’ మూవీ రివ్యూ
తాజాగా నాని ఓ ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో తనకు ఎదురైన అనుభవాలను అభిమానులతో పంచుకున్నాడు. తాను ఇండస్ట్రీకి వచ్చినపుడు కొన్ని ఇబ్బందులు.. అవమానాలు ఎదుర్కొన్నట్లు తెలిపాడు. అయితే వాటిని ఎప్పుడు తాను పట్టించుకోలేదని తెలిపారు. కేవలం తన పనిపైనే ఫోకస్ పెట్టేవాడినని.. అనవసర విషయాలను వదిలేసేవాడనిని చెప్పుకొచ్చాడు. తానే కాదు ఎవరైనా ఇండస్ట్రీకి వచ్చిన కొత్త ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఈజీ ఏదైనా వస్తే అందులో కిక్కు ఉండదని.. కష్టపడితే సాధిస్తేనే బాగుంటుందన్నాడు.
ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ తో ఇండస్ట్రీకి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినట్లు తెలిపారు. థియేటర్లు మూతపడటం.. షూటింగులు నిలిచిపోవడంతో చిత్ర పరిశ్రమపై ఆధారపడిన వారంతా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపాడు. సినిమాలను నిర్మించే నిర్మాతలకు ప్రస్తుతం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీఒక్కరిపై ఉందన్నారు. నటీనటులు తమ పారితోషికం కొంతమేర తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అయితే నటీనటులకు, సూపర్ స్టార్లకు ఒకే పర్సంటేజీ పెట్టి తగ్గించుకోండని చెప్పడం కరెక్ట్ కాదన్నారు. సినిమా బడ్జెట్.. నిర్మాతకు కలిగే నష్టాన్ని బేరీజు వేసుకొని హీరోలే వ్యక్తిగతం నిర్ణయం తీసుకుంటే బాగుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
Also Read: ఆర్ఆర్ఆర్’ అప్డేట్.. దసరాకు సెట్స్ పైకి?
ఇక ‘వి’ సినిమాతో నిర్మాతకు ఎలాంటి నష్టం లేదని చెప్పాడు. సినిమా ప్రచారం.. మార్కెట్ బాగా జరుగుతుందనే నమ్మకం తనకు ఉందన్నారు. ‘వి’లో హీరో సుధీర్ బాబుతో నటించడం కొత్త అనుభూతిని ఇచ్చిందన్నారు. నివేధా ధామస్, అదితి రావులు సినిమాకు అదనపు గ్లామర్ తీసుకొచ్చారని చెప్పాడు. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణతో తన తొలిసినిమా ‘అష్టాచమ్మా’.. 25వ సినిమా ‘వి’ చేయడం యాదృచ్ఛికమేనని తెలిపారు. తమ మధ్య మంచి బాండింగ్ ఉందని తెలిపాడు. అమిత్ త్రివేది, థమన్ ‘వి’ మూవీకి ప్లస్ అయిందని తెలిపాడు.