వాటర్ ట్యాంక్ లో 10వేల అక్రమ మద్యం బాటిల్స్… తెలంగాణ టు ఏపీ !

అగ్రరాజ్యంగా పేరుకెక్కిన అమెరికాను చరిత్రలో రెండు ఘోర వైఫల్యాలు కుదిపేశాయి. అవే మద్యపాన నిషేధం(1920–1933), వియత్నాం యుద్ధం (1955–-1975). నిజానికి అమెరికాలో మద్యపాన నిషేధం ఎప్పుడో ఎనిమిది దశాబ్దాల కిందట జరిగింది. దాని గురించి ఈ తరానికి పెద్దగా తెలియదు. అయితే, ఈ అంశంపై ఇప్పటికీ పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. వీటన్నింటి నేపథ్యంలో అదే అమెరికాలో మద్య నిషేధం ఒక విఫల ప్రయోగం అని. ఇప్పుడు ఆంధ్రాలోనూ అవే పరిస్థితులు ఉన్నాయి. సంపూర్ణ మద్యపాన నిషేధం అంటూ […]

Written By: NARESH, Updated On : September 5, 2020 4:13 pm

Alchohol transfort

Follow us on

అగ్రరాజ్యంగా పేరుకెక్కిన అమెరికాను చరిత్రలో రెండు ఘోర వైఫల్యాలు కుదిపేశాయి. అవే మద్యపాన నిషేధం(1920–1933), వియత్నాం యుద్ధం (1955–-1975). నిజానికి అమెరికాలో మద్యపాన నిషేధం ఎప్పుడో ఎనిమిది దశాబ్దాల కిందట జరిగింది. దాని గురించి ఈ తరానికి పెద్దగా తెలియదు. అయితే, ఈ అంశంపై ఇప్పటికీ పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. వీటన్నింటి నేపథ్యంలో అదే అమెరికాలో మద్య నిషేధం ఒక విఫల ప్రయోగం అని. ఇప్పుడు ఆంధ్రాలోనూ అవే పరిస్థితులు ఉన్నాయి. సంపూర్ణ మద్యపాన నిషేధం అంటూ అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్‌ ఆ దిశగా ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో కట్టడి చేస్తుండడంతో పొరుగు రాష్ట్రం నుంచి అక్రమంగా మద్యం రవాణా జరుగుతోంది. ఇది ప్రస్తుతం ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిలా మారింది. తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మద్యం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. మద్యం అక్రమ రవాణాకు చెక్ పెట్టాలని అధికారులు ప్రయత్నం చేస్తున్నా రకరకాల మార్గాల ద్వారా మద్యం దందా సాగుతోంది. కొరియర్ , పార్సిల్ సర్వీసుల ద్వారా భారీగా అక్రమ లిక్కర్ దందా జరుగుతున్నట్టు గుర్తించారు ఏపీ స్పెషల్ ఎన్ ఫోర్స్‌మెంట్ పోలీసులు.

Also Read: ‘జగనన్న విద్యాకానుక’ వాయిదా.. కారణమిదే?

తెలంగాణ రాష్ట్రం నుంచి ఏపీకి మద్యం తరలించడానికి కనిపించిన ప్రతీ అడ్డదారి తొక్కుతోంది లిక్కర్‌‌ మాఫియా. బస్సుల్లో, కార్లలో, కొరియర్‌‌లో, టూవీలర్ల మీద కూడా మద్యం అక్రమ రవాణా చేస్తున్నారు. ఏపీలో ఈ మద్యం వ్యాపారం చేసే వాళ్ళు వాటిని దాచేందుకు కొత్త పద్ధతులను ఎంచుకున్నారు. ఇక తాజాగా పెద్ద వాటర్ ట్యాంక్‌లో భారీగా తెలంగాణ మద్యం పట్టుబడింది. అమరావతి మండలం మునగోడులో భారీగా మద్యం పట్టుకున్నట్టు ఎస్ఈ బీ అధికారులు చెప్పారు.

ఇటీవల ఒక వాటర్‌‌ ట్యాంకులో దాచిన 10 వేల తెలంగాణ మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం దాచిన ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తెలంగాణ నుంచి కొరియర్‌ ద్వారా మద్యం తెప్పించి అక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్టు ఏఈబీ అధికారులు విచారణలో గుర్తించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఏపీకి వస్తున్న వాహనాల మీద పోలీసులు నిఘా పెట్టి వాహన తనిఖీలు చేస్తున్నా పోలీసుల కళ్లుగప్పి లిక్కర్ మాఫియా రేచ్చిపోతూనే ఉంది.

Also Read: బ్రేకింగ్ : మంత్రి హరీష్ రావుకు కరోనా పాజిటివ్

ఏపీ ఎస్ఈబీ అధికారులు లిక్కర్ అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారు ఎవరైనా సరే ఉక్కుపాదం మోపుతున్నారు. ఇక వారికి సహకరించే అధికారులను కూడా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్తున్నారు. ఇటీవల పలువురు పోలీసులపై, ఎస్ఈబీ అధికారులపై కేసులు నమోదు చేయడం ఇందుకు ఉదాహరణ. ఇబ్బడిముబ్బడిగా లిక్కర్‌‌ను పట్టుకుంటున్న పోలీసులు, ఎస్ఈబీ అధికారులు లిక్కర్ మాఫియాపై కఠినమైన సెక్షన్లతో కేసులు నమోదు చేస్తున్నారు.