Avika Gor: చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో తెలుగులో కూడా మంచి పాపులారిటీ తెచ్చుకుంది చైల్డ్ ఆర్టిస్ట్ అవికా గోర్. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ ‘ఉయ్యాలా జంపాలా’ అంటూ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి.. నాలుగైదు సినిమాల్లో హీరోయిన్ గా నటించి మంచి ఫాలోయింగ్ సాధించింది. కానీ, పాపకు కాలం కలిసి రాలేదు. వరుస హిట్లు వచ్చి ఉంటే.. స్టార్ హీరోయిన్ అయ్యేది. కానీ.. హిట్ మాట దేవుడెరుగు ? ఆమెకు అన్నీ సమస్యలే. అందుకే.. అవికా గోర్ కెరీర్ చాలా అయిపోయింది.

అయితే, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అవికా గోర్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఒకానొక సమయంలో తనను తానే అసహ్యించుకున్నానని చెప్పుకొచ్చింది ఈ ‘చిన్నారి పెళ్లి కూతురు. కారణం ఆమె.. సీరియల్ చేసే సమయంలో అంత ఫిట్ గా లేదు అట. ఆ బాధ గురించి ఆమె మాటల్లోనే.. ‘ఆ సమయంలో అద్దంలో నన్ను నేను చూసుకునేందుకు ఇష్ట పడేదాన్ని కాదు. అయితే.. ప్రేక్షకులు నా నటనకే కనెక్ట్ అయ్యారు. ఆ విషయంలో వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది.
Also Read: పేరుకు పెద్దమనిషి.. అతని నీచబుద్ధి వల్ల బాలిక ఆత్మహత్య..
కాగా ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్ గా హిట్ కొట్టిన ఈ బ్యూటీ ప్రస్తుతం కల్యాణ్ దేవ్‌తో ఓ సినిమాలో నటిస్తుంది. అన్నట్టు ఆ మధ్య ‘చిన్నారి పెళ్లి కూతురు’ పెళ్లి చేసుకోబోతుంది అంటూ అవికా గోర్ గురించి చాలా పుకార్లు పుట్టించారు. వాటిని నిజం చేస్తూ ఆ మధ్య అవికా గోర్ కూడా ఇతనే నా కాబోయే భర్త అంటూ మిలింద్ అనే వ్యక్తిని సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ కి పరిచయం చేసింది.

కానీ, మళ్ళీ ఆ తరువాత పెళ్లి గురించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. తాజాగా అవికా తన పెళ్లి గురించి కూడా చెబుతూ.. ‘ఇప్పుడే కాదు, మా పెళ్ళికి డేట్ ఫిక్స్ చేసుకోలేదు. మా పెళ్లి ఈ ఏడాది ఉండదు’ అంటూ స్పష్టం చేసింది. ఏది ఏమైనా అవికా గోర్, మిలింద్ ప్రేమలో పడిన తర్వాతే, కష్టపడి లావు కూడా తగ్గింది, అలాగే మళ్ళీ సినిమాల్లో యాక్టివ్ అవ్వడానికి చాల ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ స్లిమ్ గా మారి సరికొత్తగా కనిపిస్తోంది.
ఇక మధ్యమధ్యలో మ్యూజిక్ ఆల్బమ్స్ లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. అసలు ‘ఉయ్యాలా జంపాలా’, ‘సినిమా చూపిస్తా మావ’ లాంటి వరుస సక్సెస్ లు వచ్చాక, అవికా తన కెరీర్ ను కరెక్ట్ గా ప్లాన్ చేసుకోలేదు. వచ్చిన సినిమాలను వదులుకొని, చేసిన ఆ కొన్ని సినిమాల మేకర్స్ ను కూడా టైంకు సరిగ్గా రాకుండా బాగా ఇబ్బంది పెట్టింది.
Also Read: కోవిడ్ సోకిన గర్భిణికి ప్రాణం పోసిన ‘మెడికవర్’ వైద్యులు