Pushpa Movie: మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై డైరెక్టర్ సుకుమార్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం “పుష్ప”. ఈ సినిమాలో ఐకన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రి వర్గాల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. అలానే మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్ గా నటిస్తున్నారు. ఆర్య, ఆర్య 2 తర్వాత వీరిద్దరు కలిసి ఈ మూవీ తెరకెక్కిస్తుండడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావోచ్చింది. ఈ సినిమా డిసెంబర్ 17 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు ఓ విషయంలో చిక్కోచ్చి పడింది. ఈ సినిమా హిందీ వెర్షన్ థియేటర్‌లో విడుదలయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మాత్రమే డైరక్ట్ గా రిలీజ్ అవుతుందని… హిందీలో మాత్రం థియేటర్ రిలీజ్ కు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అనుకుంటున్నారు.
పుష్ప సినిమాని పాన్ ఇండియా చిత్రంగా అనుకోక ముందు తెలుగు,మలయాళంలో విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది అని సమాచారం. దీంతో చిత్రం షూటింగ్‌ను ప్రారంభించక ముందే అల్లు అర్జున్ సినిమాలకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ఈ సినిమా హిందీ డబ్బింగ్ హక్కుల్ని ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్‌కు అమ్మేసారని టాక్ వినిపిస్తుంది. అయితే ఆ తర్వాత ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల చేయాలని భావించి అందుకు తగ్గట్లు గానే ప్రమోషన్స్ కూడా చేశారు. ఈ మేరకు సినిమాలోని అన్నీ అప్డేట్ లను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేశారు. ఓ పాటను కూడా హిందీలో విడుదల చేశారు.
కానీ తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన హిందీ డబ్బింగ్ రైట్స్ కొన్న వ్యక్తి థియేటర్‌లో ఎలా విడుదల చేస్తారని అడ్డం తిరిగినట్లు తెలుస్తుంది. దీంతో చిత్రబృందానికి ఏమి చేయాలో తెలియక అయోమయోలో పడ్డారని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. తాజాగా విడుదలైన సునీల్ పోస్టర్ ను హిందీ భాషలో తప్ప మిగిలిన భాషల్లో విడుదల చేయడం గమనార్హం. మరి ఈ విషయంపై అధికారిక ప్రకటన వచె వరకు ఈ విషయంలో క్లారిటీ రాదని చెప్పాలి.