https://oktelugu.com/

I bomma vs Bappam tv : ఓటీటీ సంస్థలను వణికిస్తున్న బప్పం టీవీ.. ఫ్రీగా నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్! మేటర్ ఏంటంటే?

ఐ బొమ్మ నుండి ఉపశమనం కలిగింది అనుకునే లోపే బప్పం టీవీ అంటూ మరో తలనొప్పి తయారైంది. ఓటీటీ సంస్థలకు చెమటలు పట్టిస్తుంది. డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ కి కోట్లలో నష్టాలు తప్పేలా లేదు. విషయంలోకి వెళితే...

Written By:
  • NARESH
  • , Updated On : August 3, 2024 12:22 pm
    ibomma-rename

    ibomma-rename

    Follow us on

    I bomma  vs Bappam tv : పైరసీ దశాబ్దానికి పైగా చిత్ర పరిశ్రమను వేధిస్తున్న సమస్య. మూవీ విడుదలైన గంటల వ్యవధిలో పైరసీ ప్రింట్స్ మొబైల్స్ లో ప్రత్యక్షం అయ్యేవి. తమిళ్ రాకర్స్, మూవీ రూల్స్, ఫిల్మీ జిల్లా, మూవీస్ డా ఇలా పదికి పైగా ఫేమస్ పైరసీ సైట్స్ నిర్మాతలకు చెమటలు పట్టిస్తున్నాయి. వరల్డ్ వైడ్ ప్రతి ఏటా వేల కోట్లు పైరసీ కారణంగా నిర్మాతలు కోల్పోతున్నారు. ఇటీవల తమిళ్ రాకర్స్ వెనకున్న మాస్టర్ మైండ్ ని అరెస్ట్ చేశారు. అతడి ద్వారా అసలు పైరసీ ఎలా చేస్తారో పోలీసులు విచారణ చేసి తెలుసుకున్నారు. థియేటర్ వెనుక భాగంలో వరుసగా కొన్ని సీట్లు బుక్ చేసి క్వాలిటీ కెమెరాలు అమర్చి పైరసీకి పాల్పడుతున్నట్లు తెలిసింది. అయితే పైరసీ ప్రస్తుతం మరో టర్న్ తీసుకుంది. అది ఓటీటీ సంస్థలకు శాపంగా మారింది. ఈ పైరసీ చూసే జనాలు థియేటర్స్ ప్రింట్ ఇష్టపడటం లేదు. థియేటర్లో చిత్రీకరించిన సినిమాల్లో క్వాలిటీ ఉండదు. ప్రేక్షకుల గోల, స్క్రీన్ అటూ ఇటూ కదలడం జరుగుతుంది.

    వాయిస్ తో పాటు పిక్చర్ క్వాలిటీ చాలా నాసిరకంగా ఉంటాయి. జనాలు ఆ తరహా ప్రింట్స్ చూడటం మానేశారు. కొంచెం ఆలస్యమైనా మాస్టర్ ప్రింట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఎంత పెద్ద సినిమా అయినా నాలుగు వారాల్లో ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఓటీటీలోకి వచ్చిన ప్రతి మూవీ మాస్టర్ ప్రింట్ పైరసీ సైట్స్ లో ప్రత్యక్షం అవుతుంది. ఓ మూవీ ఓటీటీలో విడుదలైందని సమాచారం రాగానే ఒక వర్గం ప్రేక్షకులు పైరసీ సైట్స్ లోకి వెళ్లి ఫ్రీగా ఎంజాయ్ చేస్తున్నారు.

    ముఖ్యంగా ఐ బొమ్మ అత్యంత క్వాలిటీ పైరసీ చిత్రాలు అందిస్తూ ప్రేక్షకుల మందిలో రిజిస్టర్ అయ్యింది. మిగతా సైట్స్ తో పోల్చుకుంటే ఐ బొమ్మ క్వాలిటీతో అన్ని రకాల చిత్రాలు, వెబ్ సిరీస్లు అందిస్తుంది. కొన్నాళ్ళుగా ఐ బొమ్మ కనిపించడం లేదు. దాంతో ఓటీటీ సంస్థలు ఊపిరి పీల్చుకున్నాయి. కాగా ఐ బొమ్మ పేరు మార్చుకొని బప్పం టీవీ అంటూ అందుబాటులోకి వచ్చింది. దాంతో ఓటీటీ సంస్థలో మళ్ళీ టెన్షన్ మొదలైంది.

    టాలీవుడ్ లో విడుదలయ్యే అన్ని సినిమాలు చూడాలంటే కనీసం నాలుగైదు ఓటీటీ సంస్థల సబ్స్క్రిప్షన్ ఉండాలి. ముఖ్యంగా హాట్ స్టార్, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, సోనీ లివ్, జీ తెలుగు వంటి ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ మెజారిటీ తెలుగు, ఇతర భాషల చిత్రాలు, సిరీస్లు అందిస్తున్నాయి. మరి ఐదారు ఓటీటీ సంస్థల సబ్స్క్రిప్షన్ తీసుకోవడం అంటే కనీసం ఏడాదికి పది వేలు ఖర్చు అవుతుంది. అందుకే తప్పని తెలిసినా కూడా మూవీ లవర్స్ పైరసీ సైట్స్ ని ఆశ్రయిస్తున్నాయి.

    గతంతో పోల్చితే నిర్మాతలకు పైరసీ కారణంగా కలిగే నష్టం తగ్గింది. అధిక మొత్తంలో ఓటీటీ సంస్థలు భరించాల్సి వస్తుంది. బప్పం టీవీతో ఓటీటీ సంస్థలకు ముప్పు వచ్చి పడింది. ఇంటర్నెట్ అనే మహా సముద్రంలో పైరసీ దొంగలను పట్టుకోవడం, శిక్షించడం జరగని పని. కఠిన శిక్షలు అమలు చేస్తున్నా సైబర్ నేరాలు జరుగుతూనే ఉన్నాయి. అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి సంస్థలు ఇండియాలో స్ట్రగుల్ అవుతున్నాయి. బప్పం టీవీ వంటి పైరసీ సైట్స్ వాళ్లను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి.