https://oktelugu.com/

Hyper Adi : అదొక టార్చర్, జబర్దస్త్ అందుకే మానేశాను… హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్!

తనకు క్రేజ్ తెచ్చిపెట్టి లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ కి హైపర్ ఆది దూరంగా ఉంటున్నాడు. ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ షోలు మాత్రమే చేస్తున్నాడు. అయితే హైపర్ ఆది జబర్దస్త్ వీడటానికి అసలు కారణం ఏంటో ఇంతవరకు క్లారిటీ లేదు. తాజాగా జబర్దస్త్ మానేయడానికి రీజన్ ఇదే అంటూ హైపర్ ఆది ఓపెన్ అయ్యాడు

Written By:
  • NARESH
  • , Updated On : April 23, 2024 / 10:29 AM IST

    Hyper Aadi

    Follow us on

    Hyper Adi : హైపర్ ఆది జబర్దస్త్ షో వేదికగా సంచలనాలు సృష్టించాడు. ప్రారంభంలో అదిరే అభి టీంలో పని చేసిన హైపర్ ఆది తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అనతికాలంలోనే టీం లీడర్ గా మారాడు. హైపర్ ఆది వేసిన పంచులు ఓ రేంజ్ లో పేలేవి. ఆద్యంతం నవ్వులు పూయించే విధంగా ఉండేవి. హైపర్ ఆది వచ్చే వరకు జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ టీంకి పోటీ లేదు. సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను కాంబినేషన్లో సుడిగాలి సుధీర్ టీం వరుసగా స్కిట్లు కొడుతూ రికార్డు సృష్టించారు.

    ఆ సమయంలో సుడిగాలి సుధీర్ టీం కి హైపర్ ఆది గట్టి పోటీ ఇచ్చాడు. తన టాలెంట్ తో స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. హైపర్ ఆది రైటర్ కూడా కావడం విశేషం. సొంతగా స్కిట్లు రాసుకుని స్టేజ్ పై కామెడీ చేసేవాడు. అలా వచ్చిన పాపులారిటీతో సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకున్నాడు. పలు సినిమాల్లో కమెడియన్ రోల్స్ చేసి తనదైన శైలిలో మెప్పించాడు. బుల్లితెర షోలు చేస్తూనే వెండితెరపై రాణిస్తున్నాడు.

    తనకు క్రేజ్ తెచ్చిపెట్టి లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ కి హైపర్ ఆది దూరంగా ఉంటున్నాడు. ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ షోలు మాత్రమే చేస్తున్నాడు. అయితే హైపర్ ఆది జబర్దస్త్ వీడటానికి అసలు కారణం ఏంటో ఇంతవరకు క్లారిటీ లేదు. తాజాగా జబర్దస్త్ మానేయడానికి రీజన్ ఇదే అంటూ హైపర్ ఆది ఓపెన్ అయ్యాడు.హైపర్ ఆదికి సినిమా ఆఫర్లు విరివిగా వస్తున్న నేపథ్యంలో బిజీగా మారాడట. దీంతో జబర్దస్త్ కి సమయం కేటాయించడం కష్టంగా మారిందట. అది బ్యాలన్స్ చేయలేక మానేసినట్లు హైపర్ ఆది వివరణ ఇచ్చాడు.

    పైగా స్కిట్ రాసుకోవడానికి ఒక రోజు, ప్రాక్టీస్ కి మిగిలిన రోజులు సరిపోతున్నాయని హైపర్ ఆది అన్నాడు. స్కిట్లు రాయడం చాలా కష్టం అని , మొత్తం అందులోనే మునిగిపోయి ఉండాలని .. వేరే ప్రపంచం చూడలేము, అదో పెద్ద టార్చర్ అందుకే గ్యాప్ తీసుకున్నాను వివరించాడు. ఇంకా మాట్లాడుతూ… శ్రీదేవి డ్రామా కంపెనీలో పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. స్పాంటేనియస్ గా పంచులు వేసి నవ్వించే షో అంటూ హైపర్ ఆది చెప్పుకొచ్చాడు.