https://oktelugu.com/

Hyper Aadi: పాయల్ ను ఎత్తుకొని అదిరిపోయేలా డ్యాన్స్ చేసిన హైపర్ ఆది.. వీడియో వైరల్

మంగళవారం సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పాయల్ రాజ్ పుత్ బోల్డ్ రోల్ చేసింది. ఆమెపై లెక్కకు మించి శృంగార సన్నివేశాలు ఉన్నాయి.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : November 14, 2023 / 11:18 AM IST

    Hyper Aadi

    Follow us on

    Hyper Aadi: హైపర్ ఆది ఉంటే ఆ సందడే వేరు. కెరీర్ బిగినింగ్ లో ఆది జబర్దస్త్ టీమ్ లీడర్స్ వద్ద పని చేశాడు. వారి స్కిట్స్ లో చిన్న చిన్న రోల్స్ చేశాడు. అదిరే అభి టీమ్ లో ఎదిగిన హైపర్ ఆది తన కామెడీ రైటింగ్ తో ఫేమస్ అయ్యాడు. హైపర్ ఆది టైమ్లీ పంచ్ లు మాములుగా పేలవు. ఇక టీమ్ లీడర్ అయ్యాక సంచనాలు చేశాడు. ప్రస్తుతం హైపర్ ఆది బుల్లితెర స్టార్ మాత్రమే కాదు, వెండితెర నటుడు కూడా. పలు సినిమాలకు రచనా సహకారం అందిస్తున్నారని సమాచారం.
    బుల్లితెర మీద మనోడి హవా నడుస్తుంది. ఈ క్రమంలో సెలెబ్రిటీలతో కూడా ఆడుకుంటున్నాడు. తాజాగా హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ తో రొమాన్స్ చేశాడు. పాయల్ రాజ్ పుత్ లేటెస్ట్ మూవీ మంగళవారం. నవంబర్ 17న ఈ మూవీ విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా పాయల్ రాజ్ పుత్, దర్శకుడు అజయ్ భూపతి ఢీ రియాలిటీ షోకి వచ్చాడు. శేఖర్ మాస్టర్, పూర్ణ జడ్జెస్ గా ఉన్నారు. పాయల్ రాజ్ పుత్ తో ఓ ఆట ఆడుకున్నాడు హైపర్ ఆది.

    ఆమెతో సల్సా డాన్స్ చేయాలి అన్నాడు. ఆమె చేయిని అందుకుని మూమెంట్స్ ఇచ్చాడు. తర్వాత లాభం లేదని పాయల్ ని గాల్లోకి ఇచ్చాడు. అటూ ఇటూ తిప్పాడు. హైపర్ ఆది, పాయల్ డాన్స్ షో ప్రేక్షకులతో పాటు వేదికపై ఉన్నవారందరినీ అలరించింది. ఢీ షో వేదికగా జరిగిన ఈ పరిమాణం చర్చకు దారి తీసింది. అదే సమయంలో ఢీ 15 లేటెస్ట్ ప్రోమో వైరల్ అవుతుంది.

    మంగళవారం సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పాయల్ రాజ్ పుత్ బోల్డ్ రోల్ చేసింది. ఆమెపై లెక్కకు మించి శృంగార సన్నివేశాలు ఉన్నాయి. ఓ గ్రామంలో మిస్టీరియస్ గా జరుగుతున్న కొన్ని మరణాల సమాహారంగా మంగళవారం తెరకెక్కింది. ఊరిలో జరిగే దారుణాలకు పాయల్ రాజ్ పుత్ కి ఉన్న సంబంధం ఏమిటనేది సస్పెన్సు. ఆర్ ఎక్స్ 100 తో సంచనాలు చేసిన పాయల్ రాజ్ పుత్-అజయ్ భూపతి మరోసారి కలిశారు. పాయల్ కి ఈ మూవీతో బ్రేక్ వచ్చే ఆస్కారం కలదు.