
Manchu Vishnu-Hyper Aadi: జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది ఎప్పుడు వివాదాల్లో ఉండటం తెలిసిందే. తన పంచులతో అందరిని ఆకట్టుకునే ఆది తన స్కిట్లలో ఎవరినైనా టార్గెట్ చేస్తూ నవ్వించేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఈ నేపథ్యంలో పలువురి చేత మాటలు పడ్డా తాను అనుకున్నది చేయడానికి ఎప్పుడు వెనకాడరు. ఇప్పటికే పలు మార్లు వివాదాల్లో పడినా తన పంథా మాత్రం మారలేదు. ఎప్పుడు ఎదుటి వారిని నవ్వించేందుకే ప్రాధాన్యం ఇస్తుంటాడు. కామెడీ కోసం దేనికైనా సిద్ధమేనని చెబుతుంటారు.
ఇటీవల జరిగిన మా ఎన్నికల్లో జరిగిన గొడవల ఆధారంగా ఆది ఓ స్కిట్ చేశాడు. ఇందులో మంచు విష్ణును ప్రధానం గా తీసుకుని సెటైర్లు వేశాడు. దీంతో అందరు ఆశ్చర్యపోయారు. మా ఎన్నికలను టార్గెట్ చేసుకుని మంచు విష్ణు మాట్లాడిన మాటలను తన స్కిట్ లో భాగం చేసుకున్నాడు. మరికొన్ని వ్యాఖ్యలు మంచు లక్ష్మి వి తీసుకుని స్కిట్ కొనసాగించాడు. మాటల తూటాలు పేల్చాడు. దీంతో ఆదిపై మరోసారి వార్తల్లో నిలిచాడు.
గతంలో సైతం హైపర్ ఆదిపై ఎన్నో విమర్శలు వచ్చాయి. అయినా ఆయన మాత్రం తన దారి మార్చుకోలేదు. ఏదైనా చేయాలని అనుకుంటే అది చేసే వరకు నిద్రపోడు. ఈ క్రమంలో మా ఎన్నికలను సైతం తన స్కిట్లో వాడుకుని నవ్వుల పువ్వులు పూయించాడు. కానీ తాను మాత్రం వివాదాలకు కేంద్ర బిందువుగా మారాడు. దీంతో సామాజిక మాధ్యమాల్లో ఇది వైరల్ అవుతోంది.
దీనికి మల్లెమాల యాజమాన్యం ఒప్పుకోవడం కూడా సంచలనమే. వివాదాలకు దూరంగా ఉండే మల్లెమాల ప్రొడక్షన్ మా అధ్యక్షుడిని టార్గెట్ చేస్తూ స్కిట్ చేయడంపై స్పందించకపోవడం యాదృచ్ఛికమేమీ కాదు. అంతా సంచలనమే అని తెలుస్తోంది. దీంతో హైపర్ ఆది మరోసారి వివాదాలకు కేంద్ర బిందువుగా మారడం తెలిసిందే.