Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ జబర్దస్త్ కామెడీ షో యాంకర్ గా వెలుగులోకి వచ్చింది. అందంలో ఆహా అనిపించింది. తన గ్లామర్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఏళ్ల తరబడి జబర్దస్త్ యాంకర్ గా కొనసాగింది. అయితే అనూహ్యంగా ఆమె జబర్దస్త్ షో మానేసింది. అందుకు గల కారణం ఏంటో ఇంత వరకు స్పష్టత రాలేదు. తెలుగులో ఎన్ని కామెడీ షోలు వచ్చినా జబర్దస్త్ ముందు ఏవీ నిలువలేక పోయాయి. అంతగా ఆడియన్స్ ఈ షో కి కనెక్ట్ అయ్యారు.
జబర్దస్త్ అంటే కామెడీ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. జడ్జెస్ నాగబాబు, రోజా… యాంకర్ అనసూయ షో కి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. మల్లెమాల సంస్థతో కొన్ని విబేధాలు రావడంతో నాగబాబు షో నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత రోజా కూడా తప్పుకోవడంతో షో టీఆర్పీ తగ్గింది. ఇక అనసూయ 2022 లో షో కి గుడ్ బై చెప్పేసింది. స్టార్ కమెడియన్లు కూడా షోని వీడడంతో జబర్దస్త్ రేటింగ్ పాతాళానికి పడిపోయింది.
అనసూయ కి మూవీ ఆఫర్స్ రావడంతో… ఒకే సమయంలో షోలు, సినిమాలు చేయడం కష్టంగా మారింది. ఈ కారణంతోనే జబర్దస్త్ మానేస్తునట్లు అప్పట్లో చెప్పింది. అయితే అసలు కారణం ఇంకేదో ఉందని అంతా అభిప్రాయ పడ్డారు. షో టిఆర్పి దారుణంగా పడిపోవడం వలనే అనసూయ జబర్దస్త్ మానేసింది అనే వాదన కూడా ఉంది. అయితే తాజాగా హైపర్ ఆది అనసూయ ఎందుకు జబర్దస్త్ వీడిందో అసలు కారణం చెప్పి షాక్ ఇచ్చాడు.
జోర్దార్ సుజాత హైపర్ ఆది ని ఇంటర్వ్యూ చేసింది. ఆదిని ఆమె చాలా ప్రశ్నలు అడిగింది. కాగా మీ వలనే అనసూయ జబర్దస్త్ మానేశారనే వాదన ఉంది. దీనికి మీ సమాధానం ఏంటి అని అడిగింది. ఈ ప్రశ్నకు ఆది రియాక్షన్ చాలా సీరియస్ గా మారిపోయాయి. అయితే ఆది ఏం చెప్పాడు అనేది ప్రోమోలో సస్పెన్స్ గా చూపించారు. ఆది చెప్పిన కారణాలు ఏంటో ఎపిసోడ్ చూస్తే గాని తెలియదు. అప్పుడు అనసూయ ఎందుకు జబర్దస్త్ మానేశారు అనే అంశం పై క్లారిటీ వస్తుంది.