Hyper Aadi Reetu controversy: ఎక్స్ట్రా జబర్దస్త్ లో స్టార్ గా వెలుగొందాడు హైపర్ ఆది(HYPER AADI). అతడి తిరుగులేని పంచులు నాన్ స్టాప్ నవ్వులు పూయించేవి. వివాదాస్పదం అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. జబర్దస్త్ మానేయడానికి హైపర్ ఆదినే కారణం అని అనసూయ ఇటీవల ఆరోపణలు చేసింది. తాజాగా జబర్దస్త్ లేడీ కమెడియన్ రీతూ చౌదరి(RITHU CHOWDARY) సైతం ఇదే తరహా కామెంట్స్ చేయడం చర్చకు దారి తీసింది.
Also Read: నాగబాబు, నిహారికపై జబర్దస్త్ ప్రియాంక కామెంట్స్, కన్నీరు కన్నీరు పెట్టుకున్న బిగ్ బాస్ బ్యూటీ
సాధారణ టీమ్ మెంబర్ గా వచ్చి స్టార్ అయ్యాడు హైపర్ ఆది. ఎక్స్ట్రా జబర్దస్త్(JABARDASTH) కి హైపర్ ఆది-రైజింగ్ రాజు టీమ్ ప్రత్యేక ఆకర్షణగా ఉండేది. రైజింగ్ రాజు, శాంతి స్వరూప్ ల మీద హైపర్ ఆది వేసే జోక్స్ బాగా పేలేవి. అనతికాలంలో హైపర్ ఆది ఫేమ్ బుల్లితెర ఆడియన్స్ లో విపరీతంగా పెరిగింది. ఇక హైపర్ ఆది లేకపోతే ఎక్స్ట్రా జబర్దస్త్ లేదు అనే స్థాయికి ఆ షో చేరింది అనడంలో సందేహం లేదు. జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ టీమ్, ఎక్స్ట్రా జబర్దస్త్ లో హైపర్ ఆది టీమ్ ప్రధానంగా టీఆర్పీ తెచ్చిపెట్టేవి.
ఎక్స్ట్రా జబర్దస్త్ కి కీలకంగా మారిన హైపర్ ఆది ఆడిందే ఆట. జడ్జెస్, యాంకర్స్, తోటి కమెడియన్స్ మీద కూడా పంచులు వేసేవాడు. ఒక్క నాగబాబు విషయంలో మాత్రమే ఆయన జాగ్రత్తగా ఉండేవాడు. సోషల్, పొలిటికల్ ఇష్యూస్ మీద కూడా హైపర్ ఆది కామెడీ పంచులు వేసేవాడు. ఈ క్రమంలో ప్రముఖుల ఆగ్రహానికి గురైన సందర్భాలు ఉన్నాయి. రెండు మూడు సందర్భాల్లో హైపర్ ఆది బహిరంగ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. అయితే హైపర్ ఆది పంచులు కొందరిని బాధించాయని అనసూయ కామెంట్స్ తో బహిర్గతం అయ్యింది.
జబర్దస్త్ 12 ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా మెగా ఎపిసోడ్ రూపొందించారు. జబర్దస్త్ లో పని చేసిన ఒకప్పటి కమెడియన్స్ తో పాటు నాగబాబు, అనసూయ సైతం ఈ ఎపిసోడ్ కి హాజరయ్యారు. ఈ సందర్భంగా హైపర్ ఆది తన మీద వేసే పంచ్ ల కారణంగానే వెళ్లిపోవాల్సి వచ్చిందని ఓపెన్ అయ్యింది. తన అసహనం బయటపెట్టింది. తాజాగా రీతూ చౌదరి ఈ లిస్ట్ లో చేరింది. తాను జబర్దస్త్ మానేయడానికి కూడా హైపర్ ఆదినే కారణం అని ఆమె అన్నారు.
Also Read: స్విమ్ సూట్ లో సేవ్ ది టైగర్ బ్యూటీ దేవియాని శర్మ… వైరల్ గా లేటెస్ట్ ఫోటో షూట్
తాజా ఇంటర్వ్యూలో రీతూ చౌదరి మాట్లాడుతూ.. హైపర్ ఆదితో కలిసి నేను స్కిట్స్ చేశాను. ఆది వెళ్ళిపోయాక నేను ఒకదా ఒక్కదాన్నే అయిపోయాను. ఒంటరిగా ఉండలేకపోయాను. అందుకే జబర్దస్త్ మానేశాను, అన్నారు. రీతూ ఎలాంటి ఆరోపణలు చేయకున్నప్పటికీ.. హైపర్ ఆది కారణంగానే జబర్దస్త్ వదిలేశానని చెప్పింది. రీతూ ఇంకా మాట్లాడుతూ.. ప్రస్తుతం సినిమా అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నాను. కొన్ని ఆఫర్స్ వస్తున్నాయి. నాకు బోల్డ్ ఇమేజ్ ఉన్న నేపథ్యంలో ఆ తరహా పాత్రలే వస్తున్నాయని, రీతూ చౌదరి చెప్పుకొచ్చింది.