Pawan Kalyan- Hyper Aadhi: హైపర్ ఆది.. బండ్ల గణేష్ తర్వాత పవన్ కళ్యాణ్ కు అపరభక్తుడిగా మారిపోయాడు. పవన్ ను దేవుడితో కొలిచే అభిమానుల్లో ఆది ఒకరు. తన స్కిట్ లలో పవన్ గురించి ఆకాశానికెత్తేలా ఫోకస్ చేస్తుంటాడు. ఇక పవన్ ను తిట్టిన వారికి వ్యతిరేకంగా స్కిట్ లు చేస్తూ కామెడీ పండిస్తుంటాడు.

తాజాగా ఓ షోలో హైపర్ ఆది చేసిన కామెంట్స్ మాత్రం వివాదానికి దారితీశాయి. పవన్ అంటే ప్రాణమిచ్చే హైపర్ ఆది ఆయనను మరో హీరోతో పోల్చడం.. అది అస్సలు పేరులేని చిన్న హీరోను పేర్కొనడం పెనుదుమారం రేపింది. దీనిపై పవన్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు.
‘పవన్ కళ్యాణ్ పాట విన్నా.. మాట విన్నా నేను తట్టుకోలేక డ్యాన్స్ చేస్తానని..పవన్ కళ్యాణ్ తర్వాత ఆ స్థాయికి వెళ్లే హీరో ‘కిరణ్ అబ్బవరం’ మాత్రమేనంటూ’ హైపర్ ఆది కామెంట్స్ చేశాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్కడా? ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ లేని కొత్త హీరో కిరణ్ ఎక్కడా? వీరిద్దరిని హైపర్ ఆది సరిసమానంగా పోల్చడంపై పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

పోల్చడానికి కూడా అర్హత ఉండాలని.. ఒక కొత్త హీరో కోసం ఇలా పవన్ ఇమేజ్ ను ఆది వాడుకుంటాడా? అని సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. ఆదిపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. పవన్ కు కిరణ్ అబ్బవారానికి నక్కకు నాగలోకానికి అన్నంత తేడా ఉందని ఆదిపై కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.