Husharu 2 Movie Update: కొన్ని యూత్ ఫుల్ మూవీస్ ని మనం అంత తేలికగా మరచిపోలేము. ఆ సినిమాలను మనం సమయం దొరికినప్పుడల్లా టీవీ లలో చూస్తుంటాము. అలాంటి చిత్రాల్లో ఒకటి ‘హుషారు’. 2018 వ సంవత్సరం డిసెంబర్ 14 న విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఫలితాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించగా, రాహుల్ రామకృష్ణ, తేజస్, మేడిశెట్టి అభినవ్, దినేష్ తేజ్, తేజ్ కురపాటి , ప్రియా వడ్లమని, దక్షా నాగర్కర్ , రమ్య పసుపులేటి తదితరులు ఈ చిత్రం లో కీలక పాత్రలు పోషించారు. థియేటర్స్ లో కంటే ఈ చిత్రానికి ఓటీటీ లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఈ చిత్రం అందుబాటులో ఉంది , ఎవరైనా చూడాలని అనుకుంటే వెంటనే చూసేయండి.
అయితే ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కబోతుంది. ఈ సీక్వెల్ లో హీరో మరెవరో కాదు, మహేష్ బాబు అల్లుడు, అశోక్ గల్లా. ‘హీరో’ అనే చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన అశోక్ గల్లా, ఆ తర్వాత ‘దేవకీ నందన వాసుదేవ’ అనే చిత్రం చేశాడు. ఈ రెండు సినిమాలు కూడా కమర్షియల్ గా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. ఇప్పుడు సరైన సినిమాని ఎంచుకున్నాడు. ఈ చిత్రం తో తన కెరీర్ లో మొట్టమొదటి సక్సెస్ ని అందుకుంటాడు అంటూ సోషల్ మీడియా లో మహేష్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రానికి హర్ష కొనుగంటి నే దర్శకత్వం వహించబోతున్నాడు. అయితే మొదటి భాగం లో నటించిన నటీనటులు ఇందులో నటిస్తారా?, లేదంటే కేవలం అశోక్ గళ్ళ మీదనే సినిమా నడుస్తుందా అనేది తెలియాలి. ఒకవేళ మొదటి భాగానికి కొనసాగింపుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తే , యూత్ ఆడియన్స్ లో రీచ్ వేరే లెవెల్ లో ఉంటుంది.
మొదటి భాగం ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాగా ఉంటుంది. ఈ సినిమాని చూస్తున్నంత సేపు , మన నిజ జీవితం లో స్నేహితులతో కలిసి చేసిన చిలిపి వేషాలు గుర్తు రాక తప్పదు. రెండవ భాగాన్ని కూడా అదే లైన్ లో తెరకెక్కిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే కొనసాగింపుగా చెయ్యాలనుకుంటే , స్టోరీ ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది . ఎందుకంటే మొదటి భాగంలో స్నేహితులందరూ జీవితం లో స్థిరపడుతారు. మరి వాళ్ళతో అశోక్ గల్లా కి లింకప్ ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు ప్రశ్న. చూడాలి మరి ఈ క్రేజీ సీక్వెల్ ని హర్ష ఎలా మలుస్తాడు అనేది.
