Prabhas Adipurush Teaser: యంగ్ రెబెల్ స్టార్ హీరో గా నటిస్తున్న సినిమాలలో అభిమానులు మరియు ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్న సినిమాలలో ఒకటి ఆది పురుష్..హిందీ టాప్ డైరెక్టర్ ఓం రాత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ని సుమారు 600 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారట..ఇండియా లో మొట్టమొదటి మోషన్ కాప్చర్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న సినిమా కావడం తో ఇంత మొత్తం లో ఖర్చు అవుతుందని తెలుస్తుంది.

అయితే ఇటీవల విడుదల చేసిన టీజర్ కి అభిమానుల నుండి ప్రేక్షకుల నుండి తీవ్రమైన నెగటివ్ కామెంట్స్ రావడం ఈ సినిమాకి విడుదలకు ముందే భారీ నష్టాన్ని కలిగించేలా చేసింది..కంప్యూటర్ గ్రాఫిక్స్ సరిగా లేవని..కార్టూన్ సినిమాని చూస్తున్నట్టుగా అనిపించిందని నెగటివ్ కామెంట్స్ రావడం తో ..మరోసారి రీ వర్క్ చేయాల్సిందిగా ప్రభాస్ డైరెక్టర్ కి చెప్పడం తో ఇప్పుడు మూవీ టీం మొత్తం అవి సరిచేసే పనిలో నిమగ్నమై ఉంది..దానికి అదనంగా మరో అండ కోట్లు ఖర్చయ్యే అవకాశం కూడా ఉందట.
దీనికి బాగా సమయం పట్టేలాగా ఉండడం తో సంక్రాంతి రేస్ నుండి ఈ సినిమా తప్పుకున్నట్టు తెలుస్తుంది..అంతే కాకుండా ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ మొత్తం రికవర్ అవ్వాలంటే థియేట్రికల్ బిజినెస్ కచ్చితంగా 800 కోట్ల రూపాయలకు పైగానే జరగాలని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి..నిర్మాతలు కేవలం తెలుగు వెర్షన్ కి 300 కోట్ల రూపాయిల బిజినెస్ ని ఆశిస్తున్నారు..కానీ టీజర్ దెబ్బకి అంత మొత్తం పెట్టి కొనడానికి బయ్యర్స్ ఆసక్తి చూపించడం లేదట..దానికి తోడు ప్రభాస్ గత రెండు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద దారుణమైన డిజాస్టర్స్ గా నిలిచాయి..వీటికి వచ్చిన నష్టాలు వందల కోట్లలలోనే ఉంటుంది.

ప్రభాస్ సినిమా తేడా అయితే ఎలా ఉంటుందో చూసారు కాబట్టి..ఇప్పుడు ఆదిపురుష్ కి అంత భారీ బిజినెస్ చెయ్యడానికి భయపడుతున్నారు..మరి నిర్మాతలకు ఎదురు అవుతున్న ఈ అతి పెద్ద సవాలు ని ఎలా అధిగమిస్తారో చూడాలి..రెండవ టీజర్ కనుక ఆకట్టుకుంటే కచ్చితంగా ఈ సినిమా బిజినెస్ మరో లెవెల్ కి వెళ్లే అవకాశం ఉంది.