
కరోనా మహమ్మారి తరువాత అన్నిటికి రేట్లు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే సినిమాల నిర్మాతలు తమ సినిమాలను కోట్లలో అమ్ముతున్నారు. ఏరియాలను బట్టి భారీ రేట్లు చెబుతున్నారు. దాంతో మిగిలిన నిర్మాతలు కూడా అదే ఫాలో అవుతున్నారు. దీంతో ఒకర్ని మించి ఒకరు రేట్ కోట్ చేస్తుండంతో బయ్యర్ల కెరీర్ లు పూర్తిగా రిస్క్ లోకి వెళ్లిపోతున్నాయి. లేకపోతే బాలయ్య సినిమాకు ఆంధ్రలో 35 కోట్ల రేషియోలో బిజినెస్ అవ్వడం ఏమిటి ? అసలు బాలయ్య సినిమాల్లోనే ఇది రికార్డు. అంతకు ముందు బాలయ్య నుండి వచ్చిన ‘ఎన్టీఆర్ బయోపిక్’ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 35 కోట్లు రాలేదు. అలాంటిది, ఒక్క ఆంధ్రకే అంత ఎమౌంట్ కి ఎలా అమ్ముతారు ?
Also Read: 8 కోట్ల వరకూ నష్టాలు.. బయ్యర్లు అసంతృప్తి !
అలాగే నాగ్ చైతన్య-సాయిపల్లవి-శేఖర్ కమ్ముల ల ‘లవ్ స్టొరీ’ సినిమాను కూడా ఆంధ్ర ఏరియాకు 15 కోట్ల రేషియో లో అమ్మారట. అసలు ఈ సినిమాకి ఏ మాత్రం బజ్ లేదు. రిలీజ్ చేస్తే అసలు కలెక్షన్స్ వస్తాయా అనేది పెద్ద డౌటే. ఇక కొరటాల శివ-చిరంజీవి-రామ్ చరణ్ సినిమాకు నైజాం నలభై కోట్ల వరకు అమ్మారు. అదే సినిమా ఆంధ్ర రేట్లు ఇంకా ఫిక్స్ చేయలేదు. 50 నుంచి 60 కోట్ల మధ్యలో చెబుతున్నారు. బాహబలికే ఆ రేంజ్ కలెక్షన్స్ రాలేదు. మరి మెగాస్టార్ సినిమాకి అన్ని కలెక్షన్స్ వస్తాయా ? సైరా సినిమాకి ఆంధ్రలో ముపై కోట్లు మాత్రమే వచ్చాయని టాక్.
Also Read: ‘చరణ్’ పై చేయి వేసిన మెగాస్టార్ !
ఇక పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కు ఆంధ్ర ఏరియాకు నలభై కోట్లకు పైగానే రేట్ కోట్ చేస్తున్నాడు నిర్మాత దిల్ రాజు. పవన్ అజ్ఞాతవాసి సినిమాకి గట్టిగా 20 కోట్లు రాలేదు కదా ఆంధ్రాలో. అలాంటిది నలభై కోట్లు ఎలా వస్తాయి ? బన్నీ- సుకుమార్ కాంబినేషన్ లోని పుష్ప సినిమా అంధ్ర ఏరియా 45 కోట్ల రేషియోలో ఇవ్వాలని తాత్కాలికంగా నిర్ణయించుకున్నారట. ఇదొక పెద్ద కామెడీ. ఇవన్నీ ఇలా వుంటే కేజిఎఫ్ 2, ఆర్ఆర్ఆర్ లాంటి భారీ సినిమాల రేట్లు ఇంక ఏ రేంజ్ లో ఉంటాయో అని ఊహించడమే కష్టంగా ఉంది. మరి చూడాలి ఈ సినిమాలు కొనుకున్న వారి పరిస్థితి ఎలా ఉంటుందో ?
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్