Homeఎంటర్టైన్మెంట్అందరికీ త్రివిక్రమే కావాలంటే ఎలా ?

అందరికీ త్రివిక్రమే కావాలంటే ఎలా ?


టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో పని చేయాలని, చిన్న హీరో నుండి పెద్ద హీరోలు వరకూ ఆశ పడుతుంటారు. ఒక్క త్రివిక్రమ్ సినిమాల్లోనే హీరోల క్యారెక్టరైజేషన్, టైమింగ్ చాలా డిఫరెంట్ గా ఉంటూనే.. అటు కమర్షియల్ గానూ ఆకట్టుకుంటాయి. ఓ వైపు క్లాస్ ఆడియన్స్ ను మెప్పిస్తూనే.. మరో వైపు మాస్ ప్రేక్షకుల పల్స్ పట్టుకుంటాడు త్రివిక్రమ్. పైగా హీరోలకు వాళ్ళ ఫ్యాన్స్ కు కావాల్సిన ఎలిమెంట్స్ ను సినిమాలో చూపిస్తూనే.. ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ కు సినిమాని చేరువ చేస్తాడు. అందుకే త్రివిక్రమ్ కు ఉన్న డిమాండ్ ఓ రేంజ్ లో ఉంది. అందుకే ఇప్పుడున్న స్టార్ హీరోలు అందరూ త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.

Also Read: ‘ఆర్ఆర్ఆర్’కి భారీ ఆఫర్.. ‘దానయ్య’ ఇక సేఫే !

ఆ మాటకొస్తే.. పవన్ కళ్యాణ్ తో చేసిన ‘అజ్ఞాతవాసి’ లాంటి భారీ ఫ్లాప్ తర్వాత కూడా త్రివిక్రమ్ కోసం ఎన్టీఆర్, బన్నీ పోటీ పడ్డారు. ఆ క్రమంలోనే త్రివిక్రమ్ ముందుగా ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత’ చేసి తారక్ కు సూపర్ హిట్ ని ఇచ్చాడు. ఆ తర్వాత బన్నీతో ‘అలవైకుంఠపురంలో’ అంటూ బన్నీకి ఏకంగా ఇండస్ట్రీ హిట్ నే ఇచ్చాడు. మరి ప్లాప్ సినిమా తరువాతే త్రివిక్రమ్ కోసం ఇద్దరు స్టార్ హీరోలు పోటీ పడితే.. మరీ ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన తరువాత, ఇక ఎంతమంది హీరోలు పోటీ పడాలి. అందుకే మహేష్ కూడా త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. పర్సనల్ గా ఫోన్ చేసి మరీ సినిమా చేద్దాం అంటూ ప్రపోజల్ పెట్టాడు.

Also Read: మెగాస్టార్ చెల్లిగా ‘మెగా’ హీరోయినే ఫిక్స్ అయ్యిందా?

ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్న త్రివిక్రమ్ కోసం ఒక్క మహేష్ బాబునే కాకుండా రామ్ చరణ్ కూడా సినిమా చేద్దామని అడిగినట్లు తెలుస్తోంది. అలాగే అక్కినేని నాగార్జున కూడా ఎప్పటినుండో అఖిల్ తో ఒక సినిమా చేసి పెట్టు అని త్రివిక్రమ్ ను అడుగుతున్నాడు. కానీ త్రివిక్రమ్ మాత్రం స్టార్ హీరోలతోనే సినిమాలు చేసుకుంటూ.. అఖిల్ తో సినిమాని పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పటికే తరువాత సినిమాని మహేష్ బాబు తో ఫిక్స్ చేసిన త్రివిక్రమ్… ఆ తరువాత సినిమాని అఖిల్ తో చేస్తానని నాగ్ కి మాట ఇచ్చాడట. కానీ ఇప్పుడు అది కూడా సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. త్రివిక్రమ్ తో మరో సినిమా చేయడానికి బన్నీ అప్పుడే త్రివిక్రమ్ కి ప్రపోజల్ పెట్టాడట. మహేష్ సినిమా తరువాత నాతోనే సినిమా చేయాలి అని బన్నీ త్రివిక్రమ్ మీద ఒత్తిడి తెస్తున్నాడట. అయినా అందరికీ త్రివిక్రమే కావాలంటే ఎలా ?

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular