https://oktelugu.com/

‘లవ్ స్టోరీ’ కోసం మరీ ఇంత పోటీనా ?

సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినిమాలు చక్కగా ఫ్యామిలీ అంతా కూర్చుని హ్యాపీగా చూడొచ్చు అనే నమ్మకం ఉంది జనానికి. పైగా కరోనా పుణ్యమా అంటా థియేటర్ లో సినిమా చూసే పరిస్థితి కూడా లేదాయే. అందుకే ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమాలకు డిమాండ్ పెరిగింది. కాగా తాజాగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో క్రేజీ కాంబినేషన్ నాగచైతన్య – నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా వస్తోన్న ‘లవ్ స్టోరీ’ కోసం డిజిటల్ ప్లాట్ ఫామ్స్ […]

Written By:
  • admin
  • , Updated On : June 26, 2020 / 03:32 PM IST
    Follow us on


    సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినిమాలు చక్కగా ఫ్యామిలీ అంతా కూర్చుని హ్యాపీగా చూడొచ్చు అనే నమ్మకం ఉంది జనానికి. పైగా కరోనా పుణ్యమా అంటా థియేటర్ లో సినిమా చూసే పరిస్థితి కూడా లేదాయే. అందుకే ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమాలకు డిమాండ్ పెరిగింది. కాగా తాజాగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో క్రేజీ కాంబినేషన్ నాగచైతన్య – నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా వస్తోన్న ‘లవ్ స్టోరీ’ కోసం డిజిటల్ ప్లాట్ ఫామ్స్ సై అంటే సై అంటున్నాయి.

    కాగా తాజాగా ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ అండ్ డిజిటల్ రైట్స్ చైతూ గత సినిమాలన్నింటికంటే భారీ ధర పలుకుతుంది. మొన్నటి వరకూ జీ5 పోటీలో ముందు ఉంది. ఇప్పుడు అమెజాన్ రేసులోకి వచ్చింది. అలాగే మరో ప్రముఖ యాప్ కూడా ఆసక్తి చూపుతుందని లవ్ స్టోరీలో భాగం అయిన ఓ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వ్యక్తి చెబుతున్న మాట. సినిమా కాంబినేషన్ తో పాటు శేఖర్ కమ్ముల గత చిత్రం ‘ఫిదా’ భారీ బ్లాక్ బస్టర్ అవ్వడం కూడా లవ్ స్టోరికి బాగా కలిసి వచ్చాయి. దానికి తోడు క్రేజీ బ్యూటీ సాయి పల్లవి ఇందులో హీరోయిన్. చైతూతో ఆమె నటించడం ఇదే ప్రథమం కావడం, వీరి జోడీ పై ప్రేక్షకుల్లో బీభత్సమైన ఇంట్రస్ట్ ఉండటం సినిమా స్థాయిని అమాంతం పెంచేశాయి.

    ఇక డిస్ట్రిబ్యూటర్స్ గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను విడుదల చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ లవ్ స్టోరీతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి దిగుతోందనే సరికి ఇండస్ట్రీలో కూడా ఈ సినిమా పై ఆసక్తి వచ్చింది. మరి నారాయణదాస్ నారంగ్, ఎఫ్.డి.సి చైర్మైన్ రామ్మోహనరావులకు నిర్మాతలుగా ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను ఇస్తోందో చూడాలి.