Maa Elections 2021: ‘తెలుగు మా అధ్యక్ష పదవి’ఎవరిని వరించబోతుంది ? అంటూ బెట్టింగ్ లు ముమ్మరంగా సాగుతున్నాయి అంటే.. ఎంత అతిశయోక్తి ! ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయింది. కాదేదీ బెట్టింగ్ కి అనర్హం అన్నట్టు బెట్టింగ్ సంస్కృతి మన సమాజంలో రోజురోజుకు బలంగా జనం అలవాట్లల్లో నటుకుపోతుంది. అసలు కోళ్లు, క్రికెట్ దగ్గర నుంచి రాజకీయాలు, చివరకు సినిమా ఎన్నికల్లోనూ బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు.

ఇక రేపే `మా` ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఈసారి కనీ వినీ ఎరుగని స్థాయిలో పోటీ ఉంది కాబట్టి.. ఎవరు గెలుస్తారు అనే ఆసక్తి రెట్టింపు అయింది. ప్రకాష్ రాజ్, విష్ణు మధ్య పోటీ కూడా రసవత్తరంగా సాగుతున్న నేపథ్యంలో గెలుపు ఎవరిదో చెప్పడం కష్టమే. ఎవరు గెలిచినా కరెక్ట్ గా 30 ఓట్ల మెజార్టీకి మించి ఉండదని గత మా ఎన్నికల అనుభవం చెబుతోంది.
అందుకే గెలుపు విష్ణుదా? ప్రకాష్ రాజ్ దా? అని చెప్పలేని పరిస్థితి ఉంది కాబట్టే.. ఫిల్మ్‌నగర్‌లో జోరుగా బెట్టింగ్ జరుగుతోంది. కొందరు నటీనటులు, కొంతమంది నిర్మాతలూ.. లోపాయకారిగా బెట్టింగ్ వేసుకుని ఎన్నికల రిజల్ట్ కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. మంచు విష్ణుకే గెలుపు అంటూ ఎక్కువమంది విష్ణు వైపే బెట్టింగ్ పెడుతున్నారు.
పైగా అధ్యక్షుడు ఎవరన్న విషయంలో మాత్రమే కాకుండా ఏ ప్యానల్ నుంచి ఎవరు గెలుస్తారనే విషయంలో కూడా బెట్టింగ్ లు జరుగుతున్నాయి. అన్నింటి మించి పోటీ చేస్తున్న వాళ్లు కూడా బెట్ కి రెడీ అయ్యారు. ఓ ప్యానల్ నుంచి పోటీ చేస్తున్న ఓ సభ్యుడు తన గెలుపుపై అతి నమ్మకంతో లక్షల కొద్దీ బెట్ వేసినట్టు తెలుస్తోంది.