https://oktelugu.com/

NTR- Hrithik Roshan: ‘వార్ 2 ‘ సెట్స్ లోకి స్వాగతం మిత్రమా అంటూ ఎన్టీఆర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేసిన హృతిక్ రోషన్

'వార్' చిత్రం లో మరో హీరో గా టైగర్ ష్రాఫ్ నటించిన సంగతి అందరికీ తెలిసిందే, 'వార్ 2 ' లో కూడా ఎన్టీఆర్ రోల్ అలాగే ఉండబోతుందా అనే సందేహాలు అభిమానుల్లో నెలకొన్నాయి. ఇందులో ఎన్టీఆర్ పోషిస్తున్నది పాజిటివ్ క్యారక్టరా?, లేదా నెగటివ్ క్యారక్టరా అనేది ఇంకా తెలియదు.

Written By:
  • Vicky
  • , Updated On : May 20, 2023 / 12:50 PM IST

    NTR- Hrithik Roshan

    Follow us on

    NTR- Hrithik Roshan: #RRR తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఊహించిన దానికంటే పెద్ద రేంజ్ కి వెళ్తున్నాడు.ప్రస్తుతం ఆయన కొరటాల శివ తో ‘దేవర’ అనే సినిమా చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా కి సంబంధించిన ఫస్ట్ లుక్ నిన్ననే విడుదల చేసారు. ఈ చిత్రం లో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయిపోయిన వెంటనే ఆయన ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు.

    ఇది ఎప్పుడో ఖరారు అయ్యింది,కానీ ఇంతలోపే మరో ట్విస్ట్ ఇస్తూ ఎన్టీఆర్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నట్టు కొద్దిరోజుల క్రితం అధికారిక ప్రకటన చేసారు. హృతిక్ రోషన్ హీరో గా నటించిన ‘వార్’ చిత్రానికి సీక్వెల్ గా ‘వార్ 2 ‘ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం లో హృతిక్ రోషన్ తో పాటుగా ఎన్టీఆర్ కూడా నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.

    ‘వార్’ చిత్రం లో మరో హీరో గా టైగర్ ష్రాఫ్ నటించిన సంగతి అందరికీ తెలిసిందే, ‘వార్ 2 ‘ లో కూడా ఎన్టీఆర్ రోల్ అలాగే ఉండబోతుందా అనే సందేహాలు అభిమానుల్లో నెలకొన్నాయి. ఇందులో ఎన్టీఆర్ పోషిస్తున్నది పాజిటివ్ క్యారక్టరా?, లేదా నెగటివ్ క్యారక్టరా అనేది ఇంకా తెలియదు.

    ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో మరి హీరో గా నటిస్తున్న హృతిక్ రోషన్ నేడు ఎన్టీఆర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ, ‘వెల్కమ్ టూ యుద్దభూమి మిత్రమా..మనం కలిసే వరకు ప్రశాంతం గా ఉండు, తర్వాత కుదరదు గా, పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అంటూ ఒక ట్వీట్ వేసాడు. ఈ ట్వీట్ తో ఎన్టీఆర్ ఈ చిత్రం లో నటించబోతున్నట్టు ఖరారు అయిపోయింది.కొరటాల శివ సినిమా పూర్తి అవ్వగానే ఈ చిత్రం ప్రారంభం అవ్వబోతుంది అని సమాచారం.

    https://twitter.com/iHrithik/status/1659793703488339970?s=20