Hrithik Roshan opens up War 2: సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకోవడానికి తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్న బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నారు… ఇక హృతిక్ రోషన్ – జూనియర్ ఎన్టీఆర్ కలిసి చేసిన వార్ 2 సినిమా ఆగస్టు 14 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా అనుకున్న రేంజ్ లో ఆడలేదు. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం సాటిస్ఫై చేయలే. దాంతో ఈ సినిమా ప్లాప్ గా నిలిచింది… ఇక ఈ సినిమా మీద మొదటిసారి హృతిక్ రోషన్ స్పందిస్తూ ఒక ట్వీట్ చేశాడు..వార్ 2 సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కూడా దానిమీద తను మాత్రం పూర్తి ఎఫర్ట్ పెట్టి వర్క్ చేశానని, ఈ సినిమా అనే కాదు ప్రతి సినిమాకి మన పనిని మనం పూర్తిగా నిర్వర్తించి ఇంటికి వెళ్ళినప్పుడే మనల్ని మనం సంతృప్తి పరుచుకోగలుగుతాం… అలాగే సినిమాని బాగా నమ్మి మా అందరి చేత బాగా నటింపజేసుకున్న దర్శకుడు అయాన్ ముఖర్జీ చాలా మంచి టాలెంటెడ్ దర్శకుడని ఏదో చిన్నచిన్న మిస్టేక్స్ వల్ల సినిమా పెద్దగా ఆడలేదని చెప్పాడు.
సినిమా ఎలా ఉన్నా ఆ సినిమా మీద తను మాత్రం చాలా ఎఫర్ట్స్ పెట్టానని చెప్పాడు… సినిమా షూటింగ్ సన్నివేశాల్లో మనకు గాయాలైన పర్లేదు మన పని మనం సక్రమంగా పూర్తి చేసుకోవాలి. ఇతర విషయాల గురించి ఆలోచించకుండా కేవలం పాజిటివ్ థింకింగ్ తో మన పని మనం చేరుకుంటూ ముందుకు సాగితే బాగుంటుందని ఆయన చెప్పడం విశేషం…
ఆయన చేసిన ట్వీట్ లోని మాటలకు సంబంధించిన ప్రతి విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఏది ఏమైనా కూడా హృతిక్ రోషన్ ఇప్పుడు కూడా మంచి ఫిజిక్ మెయింటైన్ చేస్తూ ఎక్స్ట్రాడినరీగా డాన్సులు వేస్తూ సినిమాకి ఏది కావాలో దాన్ని పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తూ ఉంటాడు.